బిగ్ బాస్‌లోనూ ‘మీటూ’.. ఆ హీరోపై లైంగిక ఆరోపణలు!

|

Oct 25, 2019 | 1:02 PM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 13’ పెద్ద సంచలనంగా మారింది. అందుకు కారణం సిద్ధార్థ్ శుక్లా అనే కంటెస్టెంట్. హిందీ బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అతడిపై హౌస్‌లో ఉన్న మహిళా కంటెస్టెంట్లు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ‘సాంప్ సీడీ’ అనే టాస్క్ ఇచ్చాడు. ఇక టాస్క్‌లో భాగంగా దేవోలినా అనే మహిళా కంటెస్టెంట్.. తన టీమ్‌తో కలిసి […]

బిగ్ బాస్‌లోనూ మీటూ.. ఆ హీరోపై లైంగిక ఆరోపణలు!
Follow us on

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 13’ పెద్ద సంచలనంగా మారింది. అందుకు కారణం సిద్ధార్థ్ శుక్లా అనే కంటెస్టెంట్. హిందీ బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అతడిపై హౌస్‌లో ఉన్న మహిళా కంటెస్టెంట్లు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ‘సాంప్ సీడీ’ అనే టాస్క్ ఇచ్చాడు. ఇక టాస్క్‌లో భాగంగా దేవోలినా అనే మహిళా కంటెస్టెంట్.. తన టీమ్‌తో కలిసి నిచ్చెన పేర్చుతుంటే.. సిద్ధార్థ్ అడ్డుపడ్డాడు. దానితో దేవోలినా సిద్దార్థ్‌పై మండిపడింది. అంతేకాదు తనను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీటూ ఆరోపణలు చేసి కేసుపెడతానని బెదిరించింది. ఇక ఈ విషయం కాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. అంతేకాకుండా సిద్దార్థ్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే.. రష్మీ అతనితో గొడవలు పడుతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఇదే టాస్క్‌లో సిద్ధార్థ్.. మహీరా శర్మ అనే కంటెస్టెంట్ నిచ్చెనను కూడా నాశనం చేద్దామని అనుకునేసరికి.. మహీరాతో పాటు రష్మీ, దేవోలినాలు ఒకటై సిద్ధార్థ్‌ మీద విరుచుకుపడ్డారు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. తాకారని చోటల్లా తాకుతున్నాడని ఆరోపించారు. ఇలా గొడవ కాస్తా తారాస్థాయికి చేరుకోగా సిద్దార్థ్ గేమ్ నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. టాస్క్ అనంతరం ఆర్తి సింగ్, అసిమ్ రియాజ్‌లతో మాట్లాడిన సిద్ధార్థ్.. ‘టాస్క్‌‌లో భాగంగా తగిలి ఉండొచ్చునేమో గానీ.. కావాలని చేయలేదని.. వాళ్ళందరూ తనని కార్నర్ చేస్తున్నారని బాధపడ్డాడు. ఇక ఈ వ్యవహారంపై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు సిద్ధార్థ్‌ వైపు నిలవగా.. మరికొందరు ఆ ముగ్గురు లేడీస్ వైపు నిలిచారు. ఇదిలా ఉండగా బుల్లితెర నటి నటి షీతల్ ఖందల్.. ‘బాలికా వధూ’ సీరియల్ షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపంచిన సంగతి తెలిసిందే.

అయితే నెటిజన్లు మాత్రం ఆ మహిళలందరూ కావాలనే సిద్ధార్థ్‌ను టార్గెట్ చేస్తున్నారని.. అతడిని కావాలని ఇరికిస్తున్నారని మండిపడ్డారు. సిద్ధార్థ్ తన గేమ్ ఆడుతుంటే.. వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే అతన్ని ఎలిమినేట్ చేయడానికి సిద్దపడుతున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. ఏది ఏమైనా సిద్ధార్థ్‌కు బిగ్ బాస్‌తో ఇటు వ్యతిరేకత.. అటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ రెండూ ఒకేసారి వచ్చాయి.