Ravi Krishna Marriage Fix: తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా స్మాల్ స్క్రీన్ హీరోలు కూడా క్రేజ్‌ను సొంతంచేసుకున్నారు. దీంతో సెలబ్రెటీ హోదాలో వెలుగొందుతున్నారు. అలాంటి బుల్లితెర హీరో రవి కృష్ణ. అందం అభినయంతో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొగలి రేకులు సీరియల్ తో బుల్లితెరపై అడుగు పెట్టిన రవికృష్ణ మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెర రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రవికృష్ణ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడట. రవి తన సహనటితో ప్రేమలో ఉన్నాడనే పుకార్లకు చెక్ పెడుతూ.. అతని తల్లి స్వయంగా వివాహం గురించి రివీల్ చేశారు.
సూపర్ హిట్ సీరియల్ మొగలిరేకుల్లో రవికృష్ణ క్యారెక్టర్ ఆరిస్టుగా కనిపించాడు. అనంతరం వరూధిని పరిణయంతో హీరోగా మారాడు. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి నుంచీ చక్కగా ఆడుతూ.. హౌస్‌మేట్స్‌తో కలిసి మెలిసి ఉంటూ మంచోడిగా పేరు తెచ్చుకున్న రవి.. మరింత ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన రవి కి ఆఫర్లు వెల్లువెత్తాయి. లేడీస్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో పెంచుకున్నాడు.
ఆమె సీరియల్ లో నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో నటించి మెప్పిచాడు.. అయితే రవి కృష్ణ తనతో సీరియల్‌లో నటిస్తున్న నవ్యసామి కి లవ్ ఎఫేర్ నడుస్తోంది అనే టాక్ వినిపిస్తుంది. ఇదే సమయంలో వీరిద్దరూ ఓ షో లో పాల్గొని అక్కడ లవ్‌సీన్ ను పండించారు. ఒక టాస్క్‌లో భాగంగా నవ్యసామి… రవికృష్ణకు ప్రపోజ్ చేయగా.. వెంటనే ఆమెను హగ్ చేసుకున్న రవి నుదుటిపై ముద్దు పెట్టి షాకిచ్చాడు. దీంతో వీరిమధ్య బంధం నిజమేనని అనుకున్నారు. అయితే ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ.. రవి తల్లిదండ్రులు తమ కొడుకు పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. ఏప్రిల్ లో పప్పన్నాలు పెడుతున్నామని చెప్పారు. దీంతో రవికృష్ణ పెద్దలు కుదిర్చిన పెళ్ళికే సై అన్నాడని తెలుస్తోంది.
Also Read: ఒకే అబ్బాయిని ప్రేమించి.. ఇష్టపడి మరీ ఒకేసారి పెళ్లి చేసుకున్న యువతులు.. ఎక్కడో తెలుసా..?