బిగ్‌బాస్ తెలుగు సీజన్-3కి బిగ్ రిలీఫ్ దక్కిందనే చెప్పాలి. బిగ్‌బాస్-3 షో మొదలైనప్పటి నుంచీ పలు వివాదాలు చుట్టుముట్టాయి. యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా.. తమతో అసభ్యంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. దీనికి డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా పాట పాడారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వరకూ ఈ వివాదం వెళ్లింది. అంతేకాదు.. ఈ షో టెలికాస్ట్ నిర్వహణపై, షో నిర్వాహకులను అరెస్ట్ చేయాలంటూ.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. దీనికి కౌంటర్‌గా బిగ్‌బాస్ నిర్వాహకులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని కోర్టుకు విన్నవించుకున్నారు.
కాగా.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘బిగ్‌బాస్ రియాల్టీ షో’కు నాంపల్లి కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కిందనే చెప్పాలి. ఈ వివాదంపై విచారణ చేపట్టిన కోర్టు ఇరువురి వాదనలు విన్నది. కేసుపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అప్పటివరకు బిగ్‌బాస్ షో నిర్వాహకులు ఎవరినీ అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా.. బిగ్‌బాస్ షో నిర్వాహకులు ముందుగానే.. ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు.