అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా పదకొండు వారాలు పూర్తి చేసుకుని పన్నెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం రాహుల్, మహేష్, వరుణ్ సందేశ్, వితికా షేరులు ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే గోల్డెన్ మెడాలియన్ టాస్క్‌లో వితిక విజేతగా నిలవడంతో తనకు లభించిన మెడల్‌ను త్యాగం చేసి ఎలిమినేషన్ నుంచి బయటపడింది. దానితో రాహుల్, వరుణ్ సందేశ్, మహేష్ విట్టాలలో ఒకరు ఈ వారం ఎలిమినేషన్‌ను ఎదుర్కోనున్నారు.
వాస్తవానికి వితిక ఈ వారం ఎలిమినేషన్స్‌లో గనక ఉండి ఉంటే.. ఆమె ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక ఇప్పుడున్న ముగ్గురులో వరుణ్ సందేశ్.. ఎప్పటిలానే సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్‌తో ఇప్పటికే సేఫ్ జోన్‌లో ఉన్నాడని టాక్. అటు రాహుల్ మీద ప్రజల్లో సింపతీ బాగా పెరిగిందని సమాచారం. అందువల్ల ఈసారి అతడికే ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. చివరిగా మహేష్‌కు బయట ఫాలోయింగ్ తక్కువ ఉండటంతో.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వస్తాడని ఇన్‌సైడ్ టాక్.