పెళ్లి చేసుకో.. పునర్నవికి రాహుల్ సలహా!

ఓ టాస్క్‌లో భాగంగా రాహుల్ సిప్లిగంజ్, రవికృష్ణలు అతిగా ప్రవర్తించారంటూ మిగిలిన హౌస్‌మేట్స్ ఏకాభిప్రాయంతో చెప్పడం వల్ల బిగ్ బాస్ ఆ ఇద్దరినీ జైలులో బంధించాలని ఆదేశించాడు. ఇక జైలులో ఉన్న రాహుల్‌ని కలవడానికి పునర్నవి రావడం.. ఇద్దరూ కూడా వ్యక్తిగత విషయాలు పంచుకోవడం జరిగింది. తనకు ఇంకా చదువుకోవాలని ఉందని, తన డిగ్రీ ఉంది కాబట్టి ఏదైనా ఉద్యోగం చేసుకుని బతకగలనని రాహుల్‌కి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకు ఆప్షన్స్ అంటే ఇష్టమని.. దాని వల్ల తనేప్పుడూ […]

పెళ్లి చేసుకో.. పునర్నవికి రాహుల్ సలహా!

Updated on: Sep 06, 2019 | 11:52 PM

ఓ టాస్క్‌లో భాగంగా రాహుల్ సిప్లిగంజ్, రవికృష్ణలు అతిగా ప్రవర్తించారంటూ మిగిలిన హౌస్‌మేట్స్ ఏకాభిప్రాయంతో చెప్పడం వల్ల బిగ్ బాస్ ఆ ఇద్దరినీ జైలులో బంధించాలని ఆదేశించాడు. ఇక జైలులో ఉన్న రాహుల్‌ని కలవడానికి పునర్నవి రావడం.. ఇద్దరూ కూడా వ్యక్తిగత విషయాలు పంచుకోవడం జరిగింది.

తనకు ఇంకా చదువుకోవాలని ఉందని, తన డిగ్రీ ఉంది కాబట్టి ఏదైనా ఉద్యోగం చేసుకుని బతకగలనని రాహుల్‌కి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకు ఆప్షన్స్ అంటే ఇష్టమని.. దాని వల్ల తనేప్పుడూ ఎవరికి తలొంచకుండా ఉండగలనని చెప్పింది. ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్‌ను గురించి పునర్నవి మాట్లాడినట్లు తెలుస్తోంది.

దీనికి రాహుల్ బదులిస్తూ.. ‘ఇండస్ట్రీని వదిలేసి.. నీ బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుని.. సెటిల్ అయిపో.. అంటూ సలహా ఇచ్చాడు. తనకు ఇంకో రెండేళ్లు చదువుకోవాలని ఉన్నట్లు రాహుల్‌కి తన మనసులోని మాట చెప్పింది పునర్నవి. ఇలా రాత్రంతా మాట్లాడుకున్న ఈ జంట మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ గొడవ పడ్డారు. రాహుల్ అన్న మాటలకు ఫీల్ అయిన పునర్నవి కన్నీరు పెట్టుకుంది. ఇక అసలు ఏం జరిగిందో పూర్తి ఎపిసోడ్‌లో చూడాలి.