‘బిగ్ బాస్’కు ఎక్స్ కంటెస్టెంట్ల ప్రచారం ఏంటి? బాబు గోగినేని గరం గరం!

|

Jul 31, 2019 | 11:03 PM

‘బిగ్ బాస్’ హౌస్‌ను కంటెస్టెంట్లు జైలులా భావిస్తారో ఏంటో తెలియదు గానీ.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన ప్రతీ ఒక్కరు వేదాంతాలు వల్లిస్తూ.. ఇతర హౌస్‌మేట్స్, బిగ్ బాస్ షో నిర్వహణపై తీవ్ర విమర్శలు గుప్పిస్తారు. ఈ కోవలోనే తాజాగా బయటికి వచ్చిన హేమ కూడా హౌస్‌లో జరిగే అనేక విషయాలు టీవీలో టెలికాస్ట్ చేయట్లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక వీటిపై ‘బిగ్ బాస్’ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని తాజాగా […]

బిగ్ బాస్కు ఎక్స్ కంటెస్టెంట్ల ప్రచారం ఏంటి? బాబు గోగినేని గరం గరం!
Follow us on

‘బిగ్ బాస్’ హౌస్‌ను కంటెస్టెంట్లు జైలులా భావిస్తారో ఏంటో తెలియదు గానీ.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన ప్రతీ ఒక్కరు వేదాంతాలు వల్లిస్తూ.. ఇతర హౌస్‌మేట్స్, బిగ్ బాస్ షో నిర్వహణపై తీవ్ర విమర్శలు గుప్పిస్తారు. ఈ కోవలోనే తాజాగా బయటికి వచ్చిన హేమ కూడా హౌస్‌లో జరిగే అనేక విషయాలు టీవీలో టెలికాస్ట్ చేయట్లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక వీటిపై ‘బిగ్ బాస్’ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని తాజాగా స్పందిస్తూ.. తన ఫేస్‌బుక్ పేజీలో పలు ప్రశ్నలతో కూడిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

‘బిగ్‌బాస్‌ షో నుంచి హేమ ఎలిమినేట్‌ కావడం, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రి హౌస్‌లోకి ఎంటర్‌ కావడానికి సంబంధించిన వార్తలు ముందుగానే లీక్ అయ్యాయి. దీని వల్ల ‘బిగ్ బాస్’ గేమ్ స్పిరిట్ దెబ్బతింటోంది. గత సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు ఈ వార్తలు ప్రచారం చేయడం ఏమిటి?. ఇందులో బిగ్‌బాస్‌ నిర్వాహకుల తప్పుకూడా ఉంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్లో బిగ్‌బాస్‌ హౌస్‌ ఏర్పాటు చేసి.. 400 మంది తెలుగువాళ్లతో ఓ బృందాన్ని ఫార్మ్ చేశారు. పక్క గల్లిలో పాట కూడా హౌస్‌లోకి వినిపించేలా ఉన్నప్పుడు.. ఒంటరితనం అనే భావన ఎక్కడున్నట్టు?.

బిగ్‌బాస్‌‌లో పని చేసే కొంతమంది టెక్నిషియన్లు, ఎడిటర్లు, సౌండ్‌ ఆపరేటర్స్‌, డాక్టర్లు, కెమెరామెన్‌లే ఎపిసోడ్స్ షూట్‌కు సంబంధించిన లీక్‌లను బయటికి వదులుతున్నారు. ఇక వాటిని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏదో సాధించినట్లు ప్రజలకు చేరవేస్తున్నాయి. ఇలా మరిన్ని విషయాలపై బాబు గోగినేని బిగ్ బాస్ నిర్వాహకులపై తీవ్రంగా మండిపడ్డారు.