మొదట ‘బిగ్‌బాస్-3’కి అడుగడుగునా చిక్కుముడులు ఎదురయ్యాయి. ఎన్నో వివాదాల నడుమ ‘బిగ్‌బాస్-3 రియాల్టీ షో’ మొత్తానికి మొదలయ్యింది. 15 మంది కంటెస్టెంట్లు.. హేమ, శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, రవికృష్ణ, అలీ, బాబా మాస్టర్, వరుణ్ సందేశ్, వితికా శేరు జంటా, సింగర్ రాహుల్ సప్లిగంజ్, టీవీ9 జాఫర్, హిమజ, పునర్నవి, రోహిణి, మహేష్, ఆషు రెడ్డి హాస్‌లోకి వెళ్లారు.
కాగా.. ఇక నాగ్ యాంకరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీఒక్క కంటెస్టెంట్‌ని ఆత్మీయంగా పలకరించి, హాస్‌లోకి పంపారు. అయితే.. షో మొదలైన రోజే ‘బిగ్‌బాస్-3 షో’ రికార్డు బ్రేక్ చేసింది. అదేంటి..? షో మొదలైన ఒక రోజుకే రికార్డు బ్రేక్ చేసిందా..? అని అనుకుంటున్నారా..! అవునండీ.. ఈ షో స్టార్టింగ్ ఎపిసోడ్‌ని రికార్డు స్థాయిలో ప్రేక్షకులు చూశారు. తాజాగా.. ఈ విషయాన్ని కింగ్ నాగ్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
ప్రపంచంలోనే బిగ్‌బాస్ తెలుగు స్టార్టింగ్ ఎపిసోడ్ నెంబర్ వన్‌గా ట్రెండింగ్‌లో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమం మీద ప్రజలు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. తొలిరోజు ఎపిసోడే ఇంత రికార్డు క్రియేట్ చేస్తే.. ఇక ముందు ముందు బిగ్‌బాస్-3 ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుందో.. చూడాలి.
Thank uuuuuu for all the love!! #bigbosstelugu3 trending no 1 world wide last night? @StarMaa pic.twitter.com/3KpBTEAWbW
— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 22, 2019