Big News Big Debate: తలలు పగిలాయి. చొక్కాలు చిరిగాయి. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. గంటసేపు చంద్రబాబు ఇంటి దగ్గర యుద్ధవాతావరణమే కనిపించింది. అటు వంద మంది, ఇటు వంద మంది కార్యకర్తలు మోహరించడంతో పెద్ద యుద్ధమే నడిచింది. జెండా కర్రలే ఆయుధాలుగా మార్చుకుని TDP, YCP కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.
చంద్రబాబు ఇంటి వద్ద వైసీపీ చేపట్టిన నిరసన వయలెంట్‌గా మారింది. YCP MLA జోగి రమేష్ కరకట్ట వద్దకు రాగానే చంద్రబాబు ఇంటి వద్ద TDP MLC బుద్దా వెంకన్నతో పాటు మరికొందరు నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. చివరకు జెండా కర్రలతోనే కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఊహించని పరిణామాలతో పోలీసులు కూడా తక్కువ మంది ఉండటంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. బుద్దా వెంకన్న, జోగి రమేష్‌లు తోపులాటకు దిగారు. దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
చేతుల్లో ఉన్న జెండా కర్రలతోనే ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కొందరు రాళ్లు విసిరారు. రెండు వైపుల నుంచి రాళ్లు గాల్లోకి ఎగిరాయి. ఈ ఘర్షణలో కొందరికి గాయాలయ్యాయి. జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. బుద్ధా వెంకన్న సొమ్మ సిల్లి పడిపోయారు.
ఈ సమయంలో పరిస్థితి చేజారిపోతుండడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికి TDP, YCP కార్యకర్తలు దూరం దూరంగా వెళ్లడంతో కొంత ఉద్రిక్తత తగ్గింది. మళ్లీ కొద్దిసేపటికి జోగి రమేష్, బుద్ధా వెంకన్న చెక్‌పోస్ట్ దగ్గరకు వచ్చారు. దాంతో మళ్లీ టెన్షన్ నెలకొంది. ఇరువైపులా తోపులాట చోటుచేసుకుంది
గూండాల్లా ప్రవర్తించారంటూ ఎవరికి వారు విమర్శలకు దిగారు. పార్టీల మధ్య మాటలయుద్ధం మొదలైంది. ఈ సమయంలో ఇంటి ముందుకు వచ్చిన చంద్రబాబు కేడర్‌ను కలిసిమళ్లీ లోపలకు వెళ్లారు. అనంతరం ఉదయం జరిగిన పరిణామాలపై DGPకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు టీడీపీ సీనియర్ నేతలు. అనుమతి లేదని ఆఫీస్ బయటే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో TDP నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఇదే సమయంలో వైసీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. మంగళగిరి MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి DGP ఆఫీస్ లోపలకు వెళ్లారు. దీనిపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉండవల్లి రణరంగంలో ఇంతకీ ఎవరిది తప్పు. అసలు అయ్యన్నపాత్రుడు మాటలపై వైసీపీ ఎందుకు రగిలిపోయింది. టీడీపీ ఏమంటోంది.?
Read Also…PM Modi Turns 71: ప్రధాని మోడీకి బర్త్ డే విషెస్ తెలిపిన సినీ సెల్రిటీలు.. పవన్, అక్కినేని నాగార్జున సహా..
సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సీజేఐ ఎన్వీ రమణను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి