Big News Big Debate: దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం రక్షాబంధన్, ఓనమ్ పండుగల గిఫ్ట్ను ఇచ్చింది. వంట్యగ్యాస్ సిలిండర్ ధరను 2వందల రూపాయిలు తగ్గించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. గ్యాస్ ధరను తగ్గించడంతో సామాన్యులపై భారం తగ్గుతుందన్నారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. కొత్తగా ఉజ్వల కింద ఇచ్చే 75 లక్షల కనెక్షన్లతో కలిపి దేశంలో 10 కోట్ల 35 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్టు అవుతుందన్నారు. కేంద్రం ధరలను తగ్గించడంతో వంటగ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం 955 అవుతుంది. ఉజ్వల స్కీము కింద లబ్ధిదారులకు 755 రూపాయలకే లభించనుంది.
రాఖీ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ వంట గ్యాస్ ధరను తగ్గించారన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పెట్రో , డీజిల్ ధరలను కూడా కేంద్రం ఇప్పటికే తగ్గించిందన్నారు. చాలా రాష్ట్రాలు పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించినప్పటికి తెలంగాణ సహా పలు రాష్ట్రాలు తగ్గించలేదని విమర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం