Weekly Horoscope: వార ఫలాలు: జూన్ 27 నుంచి జూలై 3 వరకు.. వీరికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు

|

Jun 27, 2021 | 6:14 AM

Weekly Horoscope: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు..

Weekly Horoscope: వార ఫలాలు: జూన్ 27 నుంచి జూలై 3 వరకు.. వీరికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు
Follow us on

Weekly Horoscope: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే జూన్‌ 27 నుంచి జూలై 3వ తేదీ వరకు రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

​మేషరాశి

ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులు, బంధువుల పట్ల గౌరవం పెరుగుతుంది. అనవసర విషయాలను పట్టించుకోకపోవడం ఉత్తమం. ఉద్యోగులకు మంచి జరుగుతుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించడం మంచిది.

​వృషభరాశి

ఉద్యోగంలో ఉన్న వారికి సానుకూలమైన మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. అంతా మంచే జరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అనుకున్న ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల నుంచి సహాయ సహకరాలు అందుకుంటారు. చాలా కాలంగా ఉన్న సమస్యల ఒకటి వేధిస్తుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. బంధువుల నుంచి చెడు వార్త వినే అవకాశం ఉంది.

మిథున రాశి

ఈ రాశివారికి ఆశించిన స్థాయిలో పనులు పూర్తవుతాయి. పాజిటివ్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎవరికి పడితే వారికి హామీలు ఇవ్వకపోవడం మంచిది. ఆలోచించి అడుగులు వేయడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి

ఉద్యోగులకు ఈ వారం బాగుటుంది. మీరు ఆశించిన స్థాయిలో పనులు పూర్తవుతాయి. పాజిటివ్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్నా దాని వల్ల ప్రయోజనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు.

సింహ రాశి

ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు మంచి జరుగుతుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అయితే ఈ రాశివారు వీలైనంతగా రుణ భారం తగ్గించుకుంటారు. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రాధాన్యం ఇస్తారు.

కన్య రాశి

మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో అకస్మాత్తుగా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా జాగ్రత్త పడటం మంచిది. ఎవరినీ నమ్మి ఆర్థిక బాధ్యతలు అప్పుగించవద్దు. కొందరు పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో జాగ్రత్తలు పాటించాలి.

తుల రాశి

కొన్ని ముఖ్యమైన పనులు ఇబ్బందులు పట్టే అవకాశం ఉంది. అనుకోని విధంగా స్నేహితులనుంచి సహాయ సహకరాలు అందుతాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. వస్తుందో రాదో అనుకున్న డబ్బు చేతికందుతుంది. అనవసర ఖర్చులతో ఇబ్బందులు పడతారు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జ్యాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి

వ్యాపారులకు ఆదాయం నిలకడగా ఉంటుంది. ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. డాక్షర్లు, లాయర్లు స్వయం ఉపాధివారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. అధికంగా ఖర్చులు చేయడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం వేచి చూడక తప్పదు. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది.

ధనస్సు రాశి

ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపారం చేసే ముందు ఆలోచించి ముందుకెళ్లడం మంచిది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. పిల్లలు పురోగతి చెందుతారు. ముఖ్యమైన పనులు చేసే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి

అదనపు ఆదాయం కోసం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆశించిన స్థాయిలో కాకపోయినా సంతృప్తికరంగా లాభాలు గడిస్తారు. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కుంభ రాశి

ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. పిల్లల పురోగతి గురించి సమాచారం అందుకుంటారు. కుటుంబా కి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్దికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులకు సహాయపడతారు.

మీన రాశి

కుటుంబంలో ఉన్న సమస్యలు సామరస్యంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడికి గురవుతారు. ఏదో ఒక ఆరోగ్య సమస్య పట్టి పీడిస్తుంటుంది. వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరి కొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుంది. కొందరు మిత్రులను నమ్మి నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. బంధువులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది.