Weekly Horoscope(30-01-2022 To 5-01-2022 ): ఈరోజు ఆదివారం..ఎక్కువ మంది ఈ వారంలో ఎలా ఉంటుంది.. తమపై గ్రహ ప్రభావం ఎలా ఉంది అంటూ తమ జాతకాలను నామ నక్షత్ర ప్రకారం, లేక జన్మ నక్షత్ర ప్రకారం వారఫలాలను(Weekly Horoscope) చూస్తారు.. వాటి ఆధారంగా తాము చేపట్టిన పనులను సక్రమంగా అడ్డకుంలు లేకుండా జరుగుతాయో లేదో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఏ పని మొదలు పెట్టాలన్నా .. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. నేటి నుంచి (January 20th) ఫిబ్రవరి 5వ తేదీ(February 5th) వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశివారు ఈ వారంలో ఏ పని ప్రారంభించినా పూర్తి చేస్తారు. పెట్టుబడులకు అనుకూల సమయం. స్థిర, చరాస్తుల వలన ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణంఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త వాహనం కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. సమయానికి తగిన నిర్ణయాలను తీసుకోవడంతో సంతోషంగా గడుపుతారు.
వృషభ రాశి: ఈ రాశివారు శుభవార్త కార్య ప్రయత్నాలు నెరవేరతాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఒత్తిడి లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చులతో అధిక వ్యయం చేస్తారు. సంకల్ప బలంతో కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు శ్రమ పెరగవచ్చు. ఉద్యోగులకు ఆటంకాలు ఏర్పడవచ్చు. భూముల విషయంలో తగాదాలు ఏర్పడవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభసాటిగా ఉంటుంది.
మిధున రాశి: ఈ రాశివారు అనుకున్నది సాధిస్తారు. శుభ కార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులు అందరి ప్రశంసలను అందుకుంటారు. నూతన వస్తువులు, బట్టలు కొనుగోలు చేస్తారు. ఆకస్మికంగా ధన లాభం పొందుతారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు ఆదరణ లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. రాజకీయ ఒత్తిళ్లు ఎదురుకావచ్చు. వ్యవసాయదారులకు సంతృప్తికరమైన ఆదాయం లబిస్తుంది. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఎదురైనా సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి: ఈ రాశివారు వ్యాపారంగంలో ఉన్నవారు తమ ఆలోచనలు ఎదుటివారితో పంచుకుంటే మంచి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. అందరితో స్నేహంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి. స్థిరాస్తుల విషయంలో తగాదాలు ఏర్పడవచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులలో నెరవేర్చుకోవడానికి ఓపిక అవసరం. స్నేహితులు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది.
సింహ రాశి: ఈ రాశివారు తీసుకునే స్థిరనిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాలోని వారు అనుకూల ఫలితాలను పొందుతారు. ప్రణాళికతో ముందుకు సాగితే అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నాయకులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వాహన,భూములు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు పొందుతారు. వ్యాపార ఒప్పందాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
కన్య రాశి: ఈ రాశివారు ముఖ్యమైన పనులను చేసే ముందు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నూతన వస్తువులను ఖరీదు చేస్తారు. కోర్టు పనులు కలిసివస్తాయి. బంధు, మిత్రులతో తగాదాలు ఏర్పడవచ్చు.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. భూముల కొనుగోలులో విషయంలో జాగ్చిరత్దితగా ఉండాలి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్పయోగులకు పని భారం అధికమవుతుంది. ఈ వారంలో పెట్టే ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. వృత్తి, వ్యాపార రంగంలోని వారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. చిన్న నాటి స్నేహితులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.
తుల రాశి: ఈ రాశివారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శుభవార్తను వింటారు. ప్రారంభించిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి, స్థాన చలన పొందే అవకాశం ఉంది. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతాయి. ఆర్థిక ఒప్పందాలు కలిసివస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్రుతారు.
వృశ్చిక రాశి: ఈ రాశివారి ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్ధిక సమస్యలు తీరతాయి. వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులు తమకంటే పై అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతి మూలంగా స్థానచలన సూచన. భూముల విషయంలో తగాదాలు ఏర్పడవచ్చు. అన్ని రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంది పెద్దల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ధనస్సు రాశి: ఈ రాశివారు ఈ వారం అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. వ్యవసాయదారుల రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు ఆర్థిక ఇబ్బందులను సంయమనంతో అధిగమిస్తారు. సమయానుకూల నిర్ణయాలతో ఈ వారంలో అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు.
మకర రాశి: ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో సలహాలతో చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు , వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక వ్యయం అధికంగా అయ్యే అవకాశం ఉంది. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయంపై మనసు నిలుపుతారు. కోర్టు కేసులలో అనుకూల తీర్పులు వెలువడే అవకాశం ఉంది.
కుంభ రాశి: ఈరాశివారు ఈ వారం కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ అధికమవుతుంది. పనులు సంతృప్తిగా పూర్తి చేస్తారు. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. ఉల్లాసంగా ఉంటారు. ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారులకు వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అనుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలను పొందుతారు.
మీన రాశి: ఈరాశి వారు ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. విద్యార్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. శుభకార్యాల చేస్తారు. అధిక వ్యయం అయ్యే అవకాశం ఉంది. సమాజంలో పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్తు, బట్టలు నగలు, కొనుగోలు చేస్తారు. రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Also Read: