Weekly Horoscope 13 August 2023 19 August 2023
Weekly Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఫలితాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 13, 2023న(ఆదివారం) నుంచి ఆగస్టు 19, 2023 (శనివారం) వరకు 12 రాశుల వారివారఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): సొంత రాశిలో గురు సంచారం, అయిదవ స్థానంలో రాశ్యధిపతి సంచారం వల్ల ఈ వారమంతా చీకూ చింతా లేకుండా గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవు తుంది. నాలుగవ స్థానంలో రవి, శుక్రుల సంచారం వల్ల సుఖాలు, సౌకర్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరగడం, గృహ, వాహన సౌకర్యాల కోసం ప్రయత్నాలు సాగించడం వంటివి జరుగుతాయి. అయిదవ స్థానంలో రాశ్య ధిపతి కుజుడి సంచారం వల్ల పిల్లల బాగోగుల విషయంలో శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. మీ ఆలోచనలు, ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. లాభస్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): మూడవ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు రవితో సంచరించడం వల్ల సాధారణంగా ఎటువంటి ప్రయ త్నమైనా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ప్రయత్నాలు సానుకూలపడతాయి. నాలుగవ స్థానంలో కుజ, బుధుల సంచారం వల్ల ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధించడం, ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాల పరంగా శుభవార్తలు వినడం, స్థిరత్వం లభించడం వంటివి జరుగుతాయి. ఉద్యోగ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో తరచూ మార్పులు జరుగుతూ ఉంటాయి. నిరుద్యోగులకు ఇది బాగా కలిసి వచ్చే కాలం. కొద్దిపాటి ప్రయత్నంతో తప్పకుండా కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వ్యయ స్థానంలో గురు రాహువుల వల్ల డబ్బు బాగా ఖర్చుకావడం, స్నేహితులు మోసం చేయడం జరుగుతుంది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ రాశివారికి లాభస్థానంలో గురు, రాహువుల సంచారం కొండంత అండ. జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇంట్లో ముఖ్యమైన సౌకర్యాలన్నీ అమరుతాయి. దైవ కార్యాలు, శుభ కార్యాల మీద ఖర్చు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. భాగ్య స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. విదేశీ సంబంధమైన విషయాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. రాశ్యధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల స్వల్ప ప్రయత్నంతో అధిక లాభాలు చేతికి అందుతాయి. చొరవ, ధైర్యం, ఆత్మవిశ్వాసాలకు లోటు ఉండదు. ఆహార, విహారాల్లో, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటే వారమంతా అనుకూలంగా సాగిపోతుంది.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశిలో రవి, శుక్రుల సంచారం వల్ల సమాజంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. రాజకీయాల్లో లేని వారికి రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, బంధు మిత్రులలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధన స్థానంలో రెండు శుభ గ్రహాల సంచారం వల్ల ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. తప్పకుండా ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా సఫలం అవుతుంది. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. కెరీర్ కు సంబంధించిన పదవ స్థానంలో గురు, రాహువుల సంచారం వల్ల ఉద్యోగంలో బరువు బాధ్య తలు పెరుగుతాయి. మధ్య మధ్య సహోద్యోగులు సహాయ నిరాకరణతో ఇబ్బంది పెడుతుంటారు. అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల తరచూ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ప్రస్తుతం భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న గురు గ్రహం ఈ రాశివారికి ఒక పెద్ద అండ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి సమస్య అయినా కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తూ ఉంటుంది. పితృవర్గం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతుంటాయి. సాధారణంగా ఏ విషయంలోనూ, ఏ ప్రయత్నంలోనూ ఓటమి ఉండదు. సప్తమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల రాజకీయంగా ప్రాబల్యం ఉంటుంది. వృత్తి, ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్నా అందుకు తగ్గట్టుగా ప్రతిఫలం అందుతుంది. కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొంటుంది. సింహరాశిలో సంచారం చేస్తున్న కుజ, బుధ గ్రహాల వల్ల ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ముందుకు దూసుకుపోతారు. అయితే, వ్యయ స్థానంలో ఉన్న రవి, శుక్రుల వల్ల శత్రువుల పీడ ఉంటుంది. బంధువుల అసూయలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ప్రస్తుతం ఆరవ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల శత్రు, రోగ, రుణ బాధలు తగ్గి ఉంటాయి. ఇవి పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. లాభ స్థానంలో ఉన్న రవి, శుక్రుల వల్ల ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే, ఖర్చుల విష యంలో జాగ్రత్తగా ఉండక తప్పదు. పితృవర్గం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. రాశ్య ధిపతి అయిన బుధుడు వ్యయ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నందువల్ల, తరచూ అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. శస్త్రచికిత్స కూడా అవసరం అవుతుంది. అష్టమ స్థానంలో ఉన్న గురు, రాహువుల వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి సంపద పెరుగుతుంది. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోవడం కూడా జరుగుతుంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): సప్తమంలో గురువు, పంచమ స్థానంలో శనీశ్వరుడు ఈ రాశివారికి బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారి మాట చెల్లుబాటు కావడం, వీరి సలహాలు, సూచన లతో పాటు, వీరి పనితీరు కూడా అధికారులకు నచ్చడం వంటివి జరుగుతాయి. అదే సమ యంలో దైవ కార్యాల్లో పాల్గొనడం, ఇతరులకు సహాయం చేయడం వంటివి కూడా చోటు చేసు కుంటాయి. అయితే, సప్తమ రాశిలో ఉన్న రాహువు కారణంగా వ్యాపారంలో భాగస్వాము లతో వృత్తి, ఉద్యోగాలలో సహచరులతో కొద్దిగా లుకలుకులు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం అనేక విధాలుగా మెరుగుపడుతుంది. లాభస్థానంలో కుజ, బుధులు, దశమ స్థానంలో రవి, శుక్రుల కారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): భాగ్య స్థానంలో రవి, శుక్రులు, దశమ స్థానంలో బుధుడు, రాశ్యధిపతి కుజుడు ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం లభించడం, ప్రాభవం పెరగడం, గుర్తింపు రావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి, ఉద్యోగం మారడానికి కూడా ఈ స్థితిగతులే దోహదం చేస్తాయి. వ్యాపారాలు కూడా నిలకడగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. మొత్తం మీద వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుందని చెప్పవచ్చు. అయితే, చంచల స్వభావం పెరగడం, స్తిమితం లేకపోవడం వంటివి జరిగే అవకాశం కూడా ఉంది. నాలుగవ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యయ ప్రయాసలుంటాయి. ఆరవ స్థానంలో గురు, రాహువుల సంచారం వల్ల తరచూ అనారోగ్యాలకు, ఆర్థిక సమస్యలకు గురి కావాల్సి ఉంటుంది.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడు, పంచమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి గురువు వల్ల ఈ రాశివారు అనేక ష్టనష్టాలను అధిగమించి పురోగతి చెందడం ప్రారంభం అవుతుంది. వీరికి సర్వత్రా ఆదరాభిమానాలు, ప్రోత్సాహాలు లభిస్తాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కెరీర్ పరంగానే కాకుండా, ఆర్థిక పరంగా కూడా ప్రతి ప్రయత్నం తప్పకుండా సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరగడానికి, శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆదాయ వృద్ధి ఉంటుంది. అష్టమ స్థానంలో ఉన్న రవి, శుక్రుల కారణంగా అనవసర ఖర్చులు పెరగడం, తరచూ విమర్శలకు గురి కావడం జరిగే అవకాశం ఉంది. దశమ స్థానంలో కుజ, బుధుల సంచారం వల్ల భద్రత, స్థిరత్వం లభిస్తాయి.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశినాథుడైన శనీశ్వరుడు బలంగా స్వక్షేత్రంలో సంచారం చేస్తుండడం వీరికి అనేక విధాలుగా లాభిస్తుంది. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. క్రమంగా ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. వారసత్వ సంపద లభించే అవకాశం కూడా ఉంటుంది. నాలుగవ స్థానంలో సంచరిస్తున్న గురువు వల్ల గృహ, వాహన సౌకర్యాలకు మార్గం సుగమం అవుతుంది. విద్య, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. ఈ రాశిలో ఉన్న రాహువు వల్ల తరచూ సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. సహోద్యోగులు ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. సప్తమంలో రవి, శుక్రుల సంచారం దాంపత్య జీవితంలో అన్యోన్యత పెంచుతుంది. అయితే, అక్రమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. అష్టమంలో కుజ, బుధుల సంచారం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆరవ స్థానంలో శుక్ర, రవుల సంచారం కారణంగా శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. సప్తమ రాశిలో ఉన్న కుజ, బుధ గ్రహాల సంచారం వల్ల బంధు మిత్రులవల్లే సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతాయి కానీ, తోబుట్టువులు, సమీప బంధువులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. భాగ్య స్థానంలో ఉన్న కేతువు వల్ల దైవ సంబంధమైన వ్యవహారాల్లో పాలుపంచు కోవడం జరుగుతుంది. తృతీయ స్థానంలో గురు సంచారం కారణంగా ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది కానీ, ఖర్చులు కూడా పెరగవచ్చు. ఇదే రాశిలో రాహు సంచారం వల్ల స్నేహితులు లేదా తోబుట్టువులు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే సూచనలున్నాయి. ఈ రాశిలోని శనీశ్వరుడి వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ధన స్థానంలో ఉన్న రాశ్యధిపతి గురువు వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. కానీ, వ్యయ స్థానంలో శనీశ్వరుడి వల్ల ఖర్చులు పెరగడం జరుగుతుంది. ధనస్థానంలోని రాహువు వల్ల డబ్బు మోసపోవడం కూడా జరుగుతుంది. అయితే, వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. పంచమ స్థానంలో రవి, శుక్రుల సంచారం వల్ల పిల్లలు పైకి రావడానికి, వారి నుంచి తరచూ శుభ వార్తలు వినడానికి ఆస్కారం ఉంది. మీ ఆలోచనలు, సలహాలు, సూచనలు పదిమందికీ ఉపయోగపడతాయి. ఆరవ స్థానంలో కుజ, బుధులుండడం వల్ల కార్య సిద్ధి, వ్యవహార జయం వంటివి అనుభవానికి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. అయితే, తరచూ వ్యాపార భాగస్వాము లతో, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి