Weekly Horoscope: వారికి కుటుంబంలో ప్రశాంత వాతావరణ నెలకొంటుంది.. 12 రాశుల వారికి వారఫలాలు

| Edited By: Janardhan Veluru

Sep 10, 2023 | 4:20 AM

Weekly Horoscope (10-16 September 2023): భవిష్యత్తులో ఏం జరగనుందో గ్రహ, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని జ్యోతిష్య పండితులు ముందే లెక్కిస్తారు. జ్యోతిష్య శాస్త్రం మేరకు ఆదివారం (10 సెప్టెంబరు) నుంచి శనివారం (16 సెప్టెంబరు) వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది..? ఇక్కడ రాశుల వారీగా తెలుసుకోండి.

Weekly Horoscope: వారికి కుటుంబంలో ప్రశాంత వాతావరణ నెలకొంటుంది.. 12 రాశుల వారికి వారఫలాలు
Weekly Horoscope 10th Sep To 16th Sep 2023
Follow us on

Weekly Horoscope (10-16 September 2023): భవిష్యత్తులో ఏం జరగనుందో గ్రహ, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని జ్యోతిష్య పండితులు ముందే లెక్కిస్తారు. జ్యోతిష్య శాస్త్రం మేరకు ఆదివారం (10 సెప్టెంబరు) నుంచి శనివారం (16 సెప్టెంబరు) వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది..? ఇక్కడ రాశుల వారీగా తెలుసుకోండి.

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ వారమంతా దాదాపు ప్రశాంతంగా సాగిపోతుంది. గురు గ్రహం బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుస రిస్తారు. బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెడతారు. విద్యార్థులకు సునాయాసంగా విజయాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. పితృవర్గం నుంచి స్థిరాస్తి సంబంధమైన లాభాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. విలువైన గృహోపక రణాలు కొనుగోలు చేస్తాయి. కొందరు బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పిల్లలు చదువుల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయట పడతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ రాశివారికి ఈ వారమంతా చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ శక్తిసామర్థ్యాలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ఆదా యానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పిల్లలు చదువుల్లో ముందుంటారు. చిన్ననాటి మిత్రులతో సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. దాయాదు లతో ఆస్తి సంబంధమైన వ్యవహారాలు చక్కబడతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఘన విజయాలు సాధిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు ముందడుగు వేస్తాయి.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశికి చెందిన అన్ని రంగాల వారు ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ప్రధాన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటుం డదు. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వారం మధ్యలో కొద్దిగా అనారోగ్యాలు బాధిస్తాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాలి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కొత్త గృహ నిర్మాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంట్లో శుభ కార్యం జరపడానికి ప్లాన్ చేస్తారు. దైవ కార్యాల మీద భారీగా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన శుభ ఫలితాలుంటాయి. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వాహన ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ మీద కానీ ఉత్తమ ఫలితాలు కనిపించవు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగి పోతాయి. ఆదాయ వృద్ధికి సంబంధించి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు వ్యయ స్థానంలో సంచరిస్తున్నందువల్ల మధ్య మధ్య ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు తప్పకపోవచ్చు. ప్రభుత్వపరంగా కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గతంలో సహాయ సహకారాలు పొందిన స్నేహితులు కొందరు ముఖం చాటేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలంగానే సాగిపోతాయి కానీ, ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో మాత్రం కొద్దిగా ఆటంకాలు ఎదుర్కొంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థులు ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగకపోవచ్చు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ వారం అనేక విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఇబ్బందేమీ ఉండదు. తోబుట్టువులతో స్థిరాస్తి వ్యవహారాలు చక్క బడతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు స్థాన చలన సూచనలున్నాయి. వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. తక్కువ కష్టంతో ఎక్కువ ప్రయోజ నాలు పొందే అవకాశం ఉంటుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఒక్కసారిగా అనేక ఆఫర్లు అంది వస్తాయి. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): అర్ధాష్టమ శని కారణంగా కొన్ని పనుల్లో ఆలస్యం జరుగుతుంటుంది. మధ్య మధ్య స్వల్ప అనారో గ్యాలు కూడా తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఉద్యో గంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొన్ని పూర్తయి, కొన్ని వాయిదా పడే అవకాశం ఉంది. ఆరవ స్థానంలో ఉన్న గురువు కారణంగా, ఆర్థిక వ్యవహారాలు ఒక పట్టాన ముందుకు వెళ్లవు. ఆర్థికపరమైన చిక్కులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబంలో కొద్దిగా అభిప్రాయభేదాలు తలెత్తే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అన్ని రంగాలవారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి తేలికగా బయటపడతారు. కుటుంబ వాతా వరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. రావని వదిలేసుకున్న సొమ్ము కూడా వసూలు అవుతుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరించే అవ కాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అధికారుల సహాయ సహకారాలతో సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. దీర్ఘకాలిక రుణాల నుంచి సైతం విముక్తి లభించే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం సజావుగా సాగిపోతుంది. పిల్లలు శుభవార్తలు తీసుకు వస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగం మారే ప్రయత్నాలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యో గంలోనే అభివృద్ధి, పురోగతి కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. కుటుంబ సమస్యల పరిష్కారంల్లో లేదా కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. పిల్లల వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ ఫలితం ఉంటుంది. వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. తండ్రి నుంచి ఆర్థికంగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బంధువుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబసమేతంగా దైవ దర్శనాలకు వెళ్లడం జరుగుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
  11. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. సోదరులతో వివాదాలు, అపార్థాలు పరిష్కారం అవు తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. వృత్తి నిపుణులకు విదేశీ సంస్థల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం కానీ, హామీలు ఉండడం కానీ మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శి స్తారు. విద్యార్థులు శ్రద్ధను, శ్రమను పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారికి, నిరుద్యోగులకు కూడా ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుం టారు. ఆర్థిక ప్రయత్నాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వ్యవహా రాలు ఒక కొలిక్కి వస్తాయి. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పిల్లలు చదువుల్లో వృద్ధిలోకి వస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. దైవ కార్యాల మీద ఖర్చులు పెరుగుతాయి. తోబుట్టువులు, దగ్గర బంధువు లతో శుభ కార్యంలో పాల్గొంటారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.