Vrischika Rasi | Ugadi Horoscope 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఇలా..

| Edited By: Ravi Kiran

Mar 22, 2023 | 6:42 AM

Vrischika Rasi Ugadi Rasi Phalalu 2023: తెలుగువారి నూతన సంవత్సర కాలంలో వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.

Vrischika Rasi | Ugadi Horoscope 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఇలా..
Vrischika Rasi Ugadi Rasi Phalalu 2023
Image Credit source: TV9 Telugu
Follow us on
తెలుగువారి కొత్స సంవత్సరాదినే ఉగాది అని అంటారు.  శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బుధవారం (మార్చి 22) నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం మేషరాశిలో సంచారం ప్రారంభిస్తుంది. అదేవిధంగా, అక్టోబర్ 24న మీనరాశిలో రాహు సంచారం కన్యారాశిలో కేతువు సంచారం ప్రారంభం అవుతుంది. శని గ్రహం ఈ ఏడాదంతా కుంభ రాశిలో కొనసాగుతుంది.  మిగిలిన గ్రహాలు సుమారుగా నెలరోజులు చొప్పున వివిధ రాశుల్లో సంచరించడం జరుగుతుంది. గ్రహాల సంచారం ఆధారంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర కాలంలో వృశ్చిక రాశి వారికి జ్యోతిష్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.

వృశ్చిక రాశి (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఆదాయం 5, వ్యయం 5 | రాజపూజ్యం 4, అవమానం 5
ఈ రాశి వారికి ఈ ఏడాదంతా శనీశ్వరుడు నాలుగవ రాశిలోనూ, గురు రాహువులు ఆరవ రాశిలోనూ, కేతువు వ్యయంలోనూ సంచరిం చడం జరుగుతోంది. దీని ఫలితంగా ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను అనుభవించడం ఖాయం అని చెప్పవచ్చు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులను తరచూ వాయిదా వేయవలసి వస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఉద్యోగం, ఇల్లు మారడం జరుగుతుంది. సహనంతోను, సామరస్యంతోను, సంయమనం తోనూ వ్యవహరించాల్సి ఉంటుంది.
బంధు వర్గంలో కొందరి నుంచి అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సహనంతో, సామ రస్యంతో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ చుట్టూ అసూయా పరులు చేరుతున్నారనే విషయం గమనించాలి. పిల్లల నుంచి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. మిమ్మల్ని అవసర సమయాల్లో ఆదుకునే వారు ఉంటారు. పెళ్లి ప్రయత్నాల మీద బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తరచూ ఊహించని ఖర్చులు మీద పడుతుంటాయి. రుణ సమస్యలు చాలావరకు అదుపులో ఉంటాయి. ఎక్కువగా ఒత్తిడి ఉండకపోవచ్చు.
పిల్లల నుంచి శుభ వార్తలు
పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు తమ ఉద్యోగ ప్రయత్నాలను మరింత ఉధృతం చేయవలసి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. అవసరానికి డబ్బు అందుతూ ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది.
పరిహారం అవసరం
అనురాధ నక్షత్రం వారికి కొద్దిగా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొందరు బంధువుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..