Telugu News Astrology Venus Transit in Pisces: These 6 Zodiac Signs Likely to Attract Wealth and Prosperity
శుక్రుడితో వారికి లక్ష్మీ కటాక్షం.. వారి లైఫ్ స్టైల్ మారిపోవడం ఖాయం!
Shukra Gochar 2026: మార్చి 2 నుంచి మీన రాశిలో శుక్రుడి సంచారం ప్రారంభం కానుండటంతో కొన్ని రాశుల వారికి అదృష్ట యోగాలు ఏర్పడనున్నాయి. మార్చి 26 వరకూ కొనసాగే ఈ గోచారం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, కుంభ రాశుల వారికి ధనలాభాలు, భోగ భాగ్యాలు పెరగే సూచనలు కనిపిస్తున్నాయి. లక్ష్మీ కటాక్షంతో ఆర్థికంగా మెరుగుదల, వ్యక్తిగత జీవితంలో సంతోషాలు చేకూరే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు అంచనావేస్తున్నారు.
మార్చి 2 నుంచి తనకు ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేయబోతున్న శుక్రుడి వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు గణనీయంగా మారిపోయే అవకాశం ఉంది. మార్చి 26 వరకూ ఇదే రాశిలో సంచారం చేసే శుక్రుడి వల్ల ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది. శృంగార జీవితానికి, భోగ భాగ్యాలకు, ఆధునిక జీవనశైలికి, విలాస జీవితానికి కారకుడైన శుక్రుడు మీన రాశిలో ధన కారకుడైన గురువుకు సంబంధించిన మీన రాశిలో సంచారం చేయడం వల్ల తప్పకుండా ధన ప్రవాహం ఉంటుంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, కుంభ రాశుల వారి జీవితాల్లో చోటు చేసుకుంటాయి.
వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు తన ఉచ్ఛ రాశిలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశివారి జీవితం సంపన్నుల కోవలోకి చేరిపోతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా కలిసి వస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమై మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పట్టపగ్గాలుండవు. పట్టిందల్లా బంగారం అవుతుంది. భోగ భాగ్యాలు వృద్ధి చెందుతాయి. విదేశీ అవకాశాలు లభిస్తాయి.
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల ఆధునిక జీవనశైలి అలవడుతుంది. విలాస జీవితంలో మునిగి తేలుతారు. ప్రముఖులతో, సంపన్నులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. సంపన్న కుటుంబంతో వివాహం నిశ్చయం అవుతుంది. శృంగార జీవితం విస్తరిస్తుంది. భోగభాగ్యాల్లో జీవిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.
కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉచ్ఛ శుక్రుడు సంచారం చేస్తుండడం వల్ల విదేశీ సంపాదన యోగం పడుతుంది. విదేశాల్లో ఉద్యోగం లభించడం, ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలగడం, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదరడం, విదేశాల్లో ఉన్నత విద్యకు అవకాశాలు లభించడం వంటివి జరుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, హోదా పెరుగుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ శుక్ర సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు ఆస్కారముంటుంది. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు దాదాపు రెట్టింపవుతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని విదేశీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి హోదా, భారీ జీతభత్యాలకు అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారే సూచనలు కూడా ఉన్నాయి.
మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల సంపన్నులతో, ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా ఉంది. లక్ష్మీ కటాక్షం బాగా ఎక్కువగా ఉన్నందువల్ల భోగ భాగ్యాలకు, విలాస జీవితానికి, సుఖ సంతోషాలకు లోటుండదు. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి.
కుంభం: ఈ రాశికి ధన స్థానంలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల మార్చి 26 వరకు ఈ రాశివారి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఈ రాశివారి ప్రాభవం బాగా పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. ఆదాయ వృద్ధితో విలాసాలను అనుభవించడంలో కొత్త పుంతలు తొక్కు తారు.