Telugu News Astrology Venus Astro Remedies: Astro tips for weak venus in horoscope shukra grah puja tips in telugu
Venus Remedies: జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడా.. ఆర్ధిక ఇబ్బందులా.. ఈ పరిహారాలు చేసి చూడండి
ఎవరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారు. కనుక మీ జాతకంలో శుక్రుడు కష్టాలకు కారణం అవుతున్నట్లయితే ఈ సులభమైన పరిహారాలు చేసి చూడండి.. ఎవరి జాతకంలోనైనా శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే శుక్రవారం రోజున వీలైనంత వరకు శుభ్రమైన తెలుపు రంగు దుస్తులను ధరించాలి.
హిందూమతంలో సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని, సంపద శ్రేయస్సుకు కారణమైన శుక్రుడిని పూజించడానికి శుక్రవారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎవరి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటాడో వారు అన్ని రకాల ఆనందాలను పొందుతారని నమ్ముతారు. అంతేకాదు శుక్రుడు శుభస్థానంలో ఉంటె ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. అదే సమయంలో ఎవరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారు. కనుక మీ జాతకంలో శుక్రుడు కష్టాలకు కారణం అవుతున్నట్లయితే ఈ సులభమైన పరిహారాలు చేసి చూడండి..
ఎవరి జాతకంలోనైనా శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే శుక్రవారం రోజున వీలైనంత వరకు శుభ్రమైన తెలుపు రంగు దుస్తులను ధరించాలి.
జ్యోతిష్య శాస్త్రంలో ఏ గ్రహమైనా అశుభాలను కలిగిస్తుంటే.. వాటిని తొలగించడానికి, శుభాలను పొందడానికి అన్ని పరిష్కారాల కోసం మంత్రాలను పఠించడం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది.
అటువంటి పరిస్థితిలో శుక్ర గ్రహం శుభాన్ని పొందడానికి ముఖ్యంగా ప్రతి శుక్రవారం పూజ సమయంలో ” శ్రీ ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః ” అనే మంత్రాన్ని జపించండి.
శుక్రుడి శుభాలను ఇవ్వడానికి శుక్రవారం కొన్ని వస్తువులను దానం చేయడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు వీలైతే తెల్లని వస్త్రాలు, పంచదార, పాలు, పంచదార మిఠాయి, అన్నం, నెయ్యి మొదలైన వాటిని అవసరమైన వారికి దానం చేయండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోవాలంటే గోధుమ పిండిలో పంచదార కలిపి శుక్రవారం రోజు చీమలకు ఆహారం అందించాలి. ఈ పరిహారం చేయడం ద్వారా శుక్ర గ్రహం శుభ దృష్టితో ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు.
శుక్రవారం చేయకూడని పనులు
ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పై ఉండాలని మీరు కోరుకుంటే శుక్రవారం రోజున పులుపును తినకూడదు.
అదే విధంగా శుక్రవారాల్లో నలుపు లేదా మురికి బట్టలు ధరించ వద్దు. అంతేకాదు ఇంటిని శుభ్ర పరుచుకోవాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఏ అమ్మాయిని లేదా స్త్రీని బాధించకూడదు. ఈ రోజున అప్పు ఇవ్వవద్దు అదే సమయంలో ఎవరి దగ్గరా డబ్బు అప్పుగా తీసుకోవద్దు.
అదేవిధంగా ఈ రోజున ధర చెల్లించకుండా ఎవరి నుండి ఏ వస్తువులను తీసుకోరాదు.