
హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం, వస్తువుల అమరిక ఉంటే.. ఇంట్లో సానుకూల వాతావరణంతోపాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు. అందుకే ఇంట్లోని ప్రతి నిర్మాణం, అమరిక కూడా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. అందుకే, ఇంట్లో ప్రతి గదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసే డైనింగ్ ప్రాంతం సానుకూల శక్తి ప్రసరిస్తూ ఉండాలి. డైనింగ్ టేబుల్ విషయంలో కొన్ని చిన్న పొరపాట్లు కూడా కుటుంబంలో ఉద్రిక్తతలు, ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డైనింగ్ టేబుల్‌పై మందులు లేదా వైద్య సంబంధిత వస్తువులు ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు. ఇవి ఆరోగ్య సమస్యలను సూచించే వాటిగా భావిస్తారు. దీని వలన ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని చెబుతారు.
సాధారణంగా చాలామంది అలవాటుగా టేబుల్‌పై ఉప్పు డబ్బా ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం ఇది ఆర్థిక సమస్యలకు దారి తీస్తుందని నమ్మకం. అవసరమైనప్పుడు మాత్రమే ఉప్పు డబ్బాను ఉంచడం మంచిది.
డైనింగ్ టేబుల్‌పై పర్స్, మొబైల్ ఫోన్ లేదా ఇతర వ్యక్తిగత వస్తువులు ఉంచడం శుభం కాదు. భోజనం చేసే స్థలాన్ని ప్రశాంతంగా, పవిత్రంగా ఉంచడం అవసరం.
టేబుల్‌పై పాడైన ఆహారం లేదా ఎక్కువసేపు ఉంచిన వంటకాలు పెట్టకూడదు. ఇవి ప్రతికూలతను ఆకర్షిస్తాయని భావిస్తారు.
విరిగిన గ్లాసులు, ప్లేట్లు లేదా పాడైన వస్తువులు టేబుల్‌పై ఉంచకండి. ఇవి దురదృష్టాన్ని సూచిస్తాయని నమ్మకం.
వాస్తు ప్రకారం డైనింగ్ టేబుల్‌ను పడమర లేదా నైరుతి దిశలో ఉంచడం శ్రేయస్కరం. ఈ విధంగా ఉంచితే కుటుంబంలో ఐక్యత, ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయని అంటారు. డైనింగ్ టేబుల్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. చెక్కతో చేసిన టేబుల్ ఉంటే మరింత శుభప్రదంగా భావిస్తారు.
పనికిరాని వస్తువులను వెంటనే తొలగించడం మంచిది. భోజన సమయంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఈ చిన్న చిన్న వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి, కుటుంబ సభ్యులు సంతోషంగా జీవించగలరని విశ్వాసం.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు, జ్యోతిష్య, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)