Job Astrology: అనుకూలంగా మూడు శుభగ్రహాల సంచారం.. వారికి కుప్పలు తెప్పలుగా ఉద్యోగ అవకాశాలు..! అందులో మీరున్నారా..?

| Edited By: Janardhan Veluru

Jun 10, 2023 | 2:31 PM

Zodiac Signs: గురు, బుధ, శుక్ర గ్రహాలు మూడూ అనుకూలంగా సంచరిస్తున్నందువల్ల ఆరు రాశుల వారికి వృత్తి, ఉద్యోగ సంబంధమైన అవకాశాలు పెరగబోతున్నాయి. ఈ నెల 11వ తేదీ(ఆదివారం) నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు ఈ మూడు శుభగ్రహాలు అనేక అవకాశాలకు ద్వారాలు తెరవడం జరుగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు రావడం..

Job Astrology: అనుకూలంగా మూడు శుభగ్రహాల సంచారం.. వారికి కుప్పలు తెప్పలుగా ఉద్యోగ అవకాశాలు..! అందులో మీరున్నారా..?
Zodiac Signs
Follow us on

Zodiac Signs: గురు, బుధ, శుక్ర గ్రహాలు మూడూ అనుకూలంగా సంచరిస్తున్నందువల్ల ఆరు రాశుల వారికి వృత్తి, ఉద్యోగ సంబంధమైన అవకాశాలు పెరగబోతున్నాయి. ఈ నెల 11వ తేదీ(ఆదివారం) నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు ఈ మూడు శుభగ్రహాలు అనేక అవకాశాలకు ద్వారాలు తెరవడం జరుగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు రావడం విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభించడం, డాక్టర్లు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు కూడా అవకాశాలు పెరగడం వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంది. ఈ అవకాశాలను ఎంతగా సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మేషం, మిధునం, కర్కాటకం తుల, ధనస్సు మీనరాశులకు ఈ యోగం వర్తిస్తుంది.

  1. మేష రాశి: ఈ రాశికి చెందిన నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవ కాశం ఉంది. సాధారణంగా దూర ప్రాంతంలో ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. ఈ అవకా శాన్ని ఉపయోగించుకున్న వారు జీవితంలో ఉద్యోగ పరంగా పైకి రావడం, స్థిరపడటం వంటివి జరిగే అవకాశం ఉంది. వృత్తి రంగంలోని వారు కూడా మంచి అవకాశాలను పొందటానికి, తద్వారా జీవితంలో స్థిరపడటానికి వీలుంది. ఐటీ రంగానికి చెందినవారు విదేశాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి.
  2. మిథున రాశి: ఈ రాశికి చెందిన నిరుద్యోగులు తప్పకుండా ఉద్యోగంలో స్థిరపడే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్ది ప్రయత్నంతో వీరు కోరుకున్న విధంగా భారీ వేతనాలతో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. సొంత ఊర్లోనే మంచి సంస్థలు ఉద్యోగం సంపాదించవచ్చు. వృత్తి రంగంలోని వారికి కూడా అవకాశాలు పెరిగి జీవితం ఒక పెద్ద మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి ఒక్క క్షణం కూడా తీరికలేని గిరాకీ ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి.
  3. కర్కాటక రాశి: వృత్తి ఉద్యోగాలపరంగా ఈ రాశి వారు గత కొద్ది కాలంగా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం మొదలవుతుంది. కోరుకున్న ఉద్యోగానికి వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. బహుశా దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. డాక్టర్లు లాయర్లు ఐటీ నిపుణులు ఇంజనీర్లు ఆశించిన దాని కంటే ఎక్కువగా అధికారం, ఆర్థిక ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి. కొద్దిపాటి ప్రయత్నంతో వీరి ఆలోచనలు పథకాలు విజయవంతంగా నెరవేరడం జరుగుతుంది.
  4. తులా రాశి: వృత్తి, ఉద్యోగాలపరంగా ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. జీవన పరంగా ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తుంది. వృత్తి ఉద్యోగాలతో పాటు ఆర్థిక ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారం పెరగడానికి లేదా వ్యాపారం విస్తరించడానికి అనేక అవకాశాలు కలిసి రావడం జరుగుతుంది. ఉద్యోగ పరంగా పైకి ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతవరకు స్తబ్దుగా ఉన్న జీవితం ఒక్కసారిగా ఊపందుకునే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ధనూ రాశి: అదృష్టవశాత్తు ఈ రాశి నాధుడు అయిన గురు గ్రహం పంచమ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వారు ఎటువంటి ప్రయత్నం చేసినా అది విజయం సాధిస్తుంది. ఈ రాశి వారి ఆలోచనలు, నిర్ణయాలు, పథకాలు, ప్రయత్నాలు అతి తేలికగా సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అధికార యోగం పట్టడానికి, ప్రమోషన్ రావడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి పరంగా తప్పకుండా రాణించడం గుర్తింపు పొందడం జరుగుతుంది. వీరికి అవకాశాలతో పాటు డిమాండ్ పెరుగు తుంది. అన్ని విధాలుగాను సమయం అనుకూలంగా ఉంది.
  7. మీన రాశి: ఈ రాశి వారికి ప్రస్తుతం రాహు కేతువులు తప్ప మిగిలిన అన్ని గ్రహాలు చాలావరకు అను కూలంగా ఉండటం వల్ల వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన అవకాశాలు పోటాపోటీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వీరి సలహాలు, సూచనలు అధికారులకు, యజ మానులకు నచ్చి వీరిని అందలం ఎక్కించడం జరుగుతుంది. ఏ విధంగా చూసినప్పటికీ ప్రస్తుత సమయం ఈ రాశి వారికి అనుకూల కాలమని చెప్పవచ్చు. మంచి నిర్ణయాలు తీసుకుని అమలులో పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..