Zodiac Signs
వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవడం అనేది ఇప్పుడు ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. ఈ ఏడాది ఏ ఏ రాశుల వారు ఏ విధంగా తమ తల్లిదండ్రుల బాగోగులను చూసుకుంటారనే విషయం ఆసక్తికరంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులతో పిల్లల సంబంధాల గురించి సాన్నిహిత్యం గురించి భాగ్య స్థానాన్ని బట్టి, అంటే పితృ స్థానాన్ని బట్టి చెప్పవలసి ఉంటుంది. గ్రహచారం ప్రకారం ఏ ఏ రాశుల వారికి తల్లిదండ్రుల స్థానం ఏ స్థాయిలో అనుకూలంగా ఉన్నది ఇక్కడ పరిశీలిద్దాం..
- మేషం: ఈ రాశి వారికి వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి వరకు పితృ స్థానాధిపతి అయిన గురు గ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారు తప్పకుండా తల్లిదండ్రుల పట్ల ఆదరణ భావంతో, గౌరవ మర్యాదలతో వ్యవహరించడం జరుగుతుంది. తల్లిదండ్రులకు సేవ చేయడానికి ఈ రాశి వారు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ గురు గ్రహంతో రాహు గ్రహం కలిసి ఉండటం వల్ల తల్లిదండ్రులు మధ్య మధ్య కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశి వారికి పితృ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు స్వస్థానంలో బలంగా ఉన్నందువల్ల ప్రస్తుతానికి తల్లిదండ్రులు ఈ రాశి వారి దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు. చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం మాత్రమే జరుగుతుంది. అయితే, వృషభ రాశి వారు సాధారణంగా తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉంటారు. తల్లిదండ్రుల సంరక్షణకు కట్టుబడి ఉండే అవకాశం ఉంది. తల్లిదండ్రులను తీర్థయాత్రలకు, విహారయాత్రలకు తీసుకువెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
- మిథునం: ఈ రాశి వారికి కూడా శనీశ్వరుడే పితృ స్థానాధిపతి అవుతారు. అయితే, ఈ రాశి వారిలో ప్రేమ అభిమానాలు ఒక పట్టాన వ్యక్తం కావు. తల్లిదండ్రుల విషయంలో ఈ రాశి వారు నిర్లిప్తంగా, ఉదాసీనంగా ఉండే అవకాశం ఉంది. వీరికి తల్లిదండ్రులతో ముఖ్యంగా తండ్రితో సాన్నిహిత్యం తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది వీరు తల్లిదండ్రులకు దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల వద్దకు ఒక పట్టాన రాలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
- కర్కాటకం: ఈ రాశి వారికి తల్లిదండ్రులతో కలిసి ఉండే అవకాశం ఉంది. తండ్రి కంటే తల్లితో ఎక్కువగా సాన్నిహిత్యం ఉంటుంది. ఈ ఏడాది తల్లిదండ్రుల్లో ఒకరికి స్వల్పంగా అనారోగ్యం చేసే అవకాశం ఉంది. తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవడంలో ఈ రాశి వారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. తల్లిదండ్రులతో తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. సాధారణంగా కర్కాటక రాశి వారు తమ తల్లిదండ్రులకు దూరంగా ఉండే అవకాశం లేదు.
- సింహం: ఈ రాశి వారికి సాధారణంగా తల్లిదండ్రులను చూసుకునే అవకాశం ఉండదు. పెద్దలకు దూరంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులని చూసుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ అది నెరవేరే అవకాశం ఉండదు. ఈ ఏడాది ఇందుకు ఏమాత్రం అవకాశం ఉండక పోవచ్చు. ఈ రాశి వారిలో తల్లిదండ్రుల పట్ల కొద్దిగా అసంతృప్తి ఉండే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారు కానీ తల్లిదండ్రులు కానీ దూర ప్రాంతంలో స్థిరపడటం జరుగుతుంది.
- కన్య: ఈ రాశికి పితృ స్థానాధిపతి అయిన శుక్ర గ్రహం ఈ ఏడాది చివరి వరకు అనుకూలంగా ఉన్నందువల్ల తల్లిదండ్రులకు వీలైనంతగా ఉపయోగపడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవడం జరుగుతుంది. తండ్రి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించే అవకాశం ఉంది. తల్లిదండ్రుల సంరక్షణ మీద ఈ రాశి వారు భారీగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈ రాశి వారికి తల్లిదండ్రులకు మధ్య ప్రేమాభిమానాలు బాగా పెరిగే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశి వారికి తొమ్మిదవ స్థానాధిపతి అయిన బుధుడు చాలా వరకు అనుకూలంగా ఉన్నందు వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సాన్ని హిత్యం పెరిగే అవకాశం ఉంది. కలిసి ఉండే అవకాశం లేకపోయినప్పటికీ తరచూ వచ్చి లేదా కలుసుకొని బాగోగులను చూసుకోవటం జరుగు తుంది. వైద్య ఖర్చులను భరించడంతోపాటు తీర్థయాత్రలకు లేదా విహారయాత్రలకు తీసుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. తల్లిదండ్రుల పట్ల అభిమానంతో గౌరవ మర్యాదలతో వహించే అవకాశం ఉంది.
- వృశ్చికం: సాధారణంగా ఈ రాశి వారికి తల్లిదండ్రుల పట్ల ఆదరణ భావం తక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల విషయంలో ఎక్కువగా ఉదాసీన వైఖరిని కనబరుస్తూ ఉంటారు. అంతేకాక, తల్లిదండ్రులు కూడా ఈ రాశి వారితో కలిసి ఉండటానికి అంతగా ఇష్టపడరు. వృశ్చిక రాశి వారిలో కోపతాపాలు కాస్తంత ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. కలిసి ఉండటం మినహా ఇతరత్రా అనేక విధాలుగా వీరు తల్లిదండ్రుల బాగోగులను చూసుకునే అవకాశం ఉంది.
- ధనుస్సు: సాధారణంగా ఈ రాశి వారికి తల్లిదండ్రులంటే ప్రేమ అధికంగా ఉంటుంది. తల్లిదండ్రులను వీలైనంతగా సేవించుకోవాలని ఆరాటపడతారు. ఈ రాశి వారు ఈ ఏడాది తమ తల్లిదండ్రులను తీర్థయాత్రలకు, విహారయాత్రలకు, ఇష్టమైన ప్రాంతాలకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో ఎంతగానో శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి తల్లిదండ్రుల నుంచి ఏమాత్రం ఊహించని స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి.
- మకరం: ఈ రాశి వారిలో తల్లిదండ్రుల పట్ల అభిమానం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తల్లిదండ్రుల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడం, అనేక సౌకర్యాలు కల్పించడం వంటివి జరగవచ్చు. తల్లిదండ్రుల మాటకు విలువనివ్వటం, వారి సలహాలు తీసుకోవడం వంటివి కూడా జరుగు తాయి. సాధారణంగా కుటుంబ పెద్దలు, తల్లి దండ్రులు, వృద్ధులు ఈ రాశి వారితో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. తల్లిదండ్రులతో ఈ రాశి వారు ఎక్కువగా స్నేహభావంతో మెలగటం జరుగుతుంది.
- కుంభం: ఈ రాశి వారు తల్లిదండ్రులను ఆదరించడంలో అందరికంటే ముందుంటారు. తల్లిదండ్రులతో అనేక విధాలుగా సాన్నిహిత్యం పెంచుకుంటారు. తల్లిదండ్రులకు కావలసిన సౌకర్యాలను సమకూర్చి పెడతారు. తల్లిదండ్రులకు కూడా ఈ రాశి వారి పట్ల విపరీతమైన అభిమానం ఉంటుంది. సాధారణంగా ఈ రాశి వారు వృద్ధుల పట్ల ఆదరాభిమానాలు కలిగి ఉంటారు. ఈ ఏడాది ఈ రాశి వారు తల్లిదండ్రులతో తీర్థయాత్రలు లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
- మీనం: ఈ రాశి వారికి తల్లిదండ్రులకు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు తల్లిదండ్రుల బాగోగులను దగ్గర ఉండి చూసుకునే అవకాశం ఉండదు. ఎక్కువగా దూరప్రాంతాలలో ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ వాటిని దూరం నుంచే వ్యక్తం చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులలో ఒకరి ఆరోగ్యం పట్ల ఆందోళన చెందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..