
యువతీయువకులకు పెళ్లిని నిశ్చయించే సమయంలో మాత్రమే కాదు పెళ్ళికి ముహర్తం పెట్టే సమయంలో కూడా జాతకాలను చూస్తారు. ఇరువురు రాశులు, నక్షత్రాల ఆధారంగా గణాలు లెక్కిస్తారు. వాటి ఆధారంగా పెళ్ళికి రెడీ అవుతారు. అయితే కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి పెళ్లి జరగడం వలన మంచి దంపతులు అవుతారు. అయితే మరికొన్ని నక్షత్రాలు అనుకూలంగా ఉండవు. ఇటువంటి వ్యక్తులకు పెళ్లి చేసి ఒకటి చేస్తే నిత్యం గొడవలు పడుతూఉంటారు. కనుక కొన్ని నక్షత్రాలలో పుట్టిన యువకులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమ్మాయిలను అమితంగా ప్రేమిస్తారు. వీరు తమ భార్యని ఘాడంగా ప్రేమిస్తారు. తమ భార్య కోసం ఏమైనా చేస్తారట. మరి అమ్మాయిలకు అటువంటి నక్షత్రం గల ఆబ్బాయి భర్తగా దొరికే జాక్ పాట్ కొట్టినట్లే నట ఆ నక్షత్రాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
ఉత్తర ఫల్గుణి: ఈ నక్షత్రానికి అధినేత సూర్యుడు. ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చాలా నమ్మకమైనవారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. చాలా నిజాయితీ, నిబద్ధతను కలిగి ఉంటారు. వీరు తమ భార్యను చాలా ప్రేమిస్తారు. తమ భార్య పట్ల అమితమైన శ్రద్ధ కలిగి ఉంటారు. భార్యని తోషంగా ఉంచేందుకు.. తమ భార్యకు ఎలాంటి లోటు రాకుండా చూసుకునేందుకు నిత్యం కష్టపడతారు.
అనురాధ నక్షత్రం: ఈ నక్షత్రానికి అధిపతులు శనీశ్వరుడు, అంగారకుడు. ఈ నక్షత్రంలో పుట్టిన పురుషులు చాలా శ్రద్ధ కలిగినవారు. వీరు చిన్నతనం నుంచి కూడా తమ కుటుంబానికి బాగా ప్రాధాన్యం ఇస్తారు. పెళ్లి తర్వాత తన భార్య జీవితంలో అన్నీ తానై ఉండాలని కోరుకుంటారు. భార్య అభిప్రాయలను గౌరవిస్తారు. తన భార్యను సంతోషంగా చూసుకోవడానికి, సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు.
హస్త నక్షత్రం: ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అధిదేవత సూర్యుడు. ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు చాలా చాలా తెలివైనవారు. ప్రతిభ కలిగిన వారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సూక్ష్మమైన స్వభావం, వివరాలపై శ్రద్ధ, ఆచరణాత్మక ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రతిభ కలిగిన వారు. జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తనకు తగిన మహిళను ఎంచుకొని.. జీవితాంతం తన భార్యని సంతోషంగా ఉండేలా చూసుకోవాలని భావిస్తారు.
రోహిణి నక్షత్రం: ఈ నక్షత్ర పాలకుడు చంద్రుడు. ఈ నక్షత్రంలో జన్మించిన సృజనాత్మకత, ఆకర్షణ, సామాజిక నైపుణ్యాలు, సౌందర్య దృష్టి, పోషణ స్వభావం కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు అత్యంత విశ్వాసపాత్రులు. భార్యని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. తన కుటుంబానికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవడానికి నిరంతరం కష్టపడతారు. భార్య భర్తల బంధంలో చాలా నిజాయతీగా ఉంటారు.
శ్రవణ నక్షత్రం: ఈ నక్షత్రానికి చంద్రుడు అధిపతి.. శ్రీ మహా విష్ణువు అధిదేవత. ఈ ఈ నక్షత్రంలో పుట్టిన యువకులు మితభాషులు, ధర్మబద్ధులు, వినయంగా ఉంటారు. క్రమశిక్షణ కలిగి జీవిస్తారు. తమ భార్యని అమితంగా ప్రేమిస్తారు. భార్య పట్ల శ్రద్దపూర్వకంగా ఉంటారు. తమ భార్యని విడిచి పెట్టి ఉండడానికి ఇష్టపడరు. తాను ఎంత కష్టపడినా సరే తన కుటుంబం సుఖ శాంతులతో ఉంచాలని కోరుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.