Zodiac Signs: ఈ నాలుగు రాశులవారిలో ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది.. మరి ఇందులో మీరున్నారా చెక్ చేసుకోండి..

| Edited By: Janardhan Veluru

Feb 27, 2023 | 12:37 PM

Telugu Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఉత్సాహం, శక్తి యుక్తులు అధికంగా ఉంటాయి. మరికొన్ని రాశుల వారిలో బద్ధకం, సోమరితనం, నిరుత్సాహం వంటివి మోతాదు మించి ఉంటాయి.

Zodiac Signs: ఈ నాలుగు రాశులవారిలో ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది.. మరి ఇందులో మీరున్నారా చెక్ చేసుకోండి..
Zodiac Signs
Image Credit source: TV9 Telugu
Follow us on
జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఉత్సాహం, శక్తి యుక్తులు అధికంగా ఉంటాయి. మరికొన్ని రాశుల వారిలో బద్ధకం, సోమరితనం, నిరుత్సాహం వంటివి మోతాదు మించి ఉంటాయి. అయితే, ఏ గ్రహం ఏ రాశిలో ఉంది అన్న దాన్ని బట్టి కూడా ఈ లక్షణాలు ఆధారపడి ఉంటాయి. బాగా ఉత్సాహం ఎనర్జీ ఉన్న రాశుల్లో మేషం, కర్కాటకం, తుల, ధనస్సు రాశి వారు అగ్రస్థానంలో ఉంటారు. ఈ రాశుల్లో శని ఉన్నపక్షంలో వీరిలో కూడా బద్ధకం ఒక పాలు ఎక్కువగానే ఉంటుంది. వృషభం, సింహం, మకరం కుంభరాశి వారికి బద్ధకం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశులలో శుభగ్రహాలు ముఖ్యంగా గురు, శుక్ర, బుధ, గ్రహాలు ఉన్నపక్షంలో వీరిలో కనిపించినంత చురుకుదనం మరే రాశిలోనూ కనిపించదు. నిజానికి చురుకుదనం లేకపోవడానికి, బద్ధకంగా ఉండటానికి శని కారకుడు.

మేష రాశి

ఈ రాశి వారిలో ఎనర్జీ కాస్తంత ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ రాశి వారు ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా కూర్చుని కనిపించరు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యి ఉంటారు. యాక్టివ్ గా ఉండటం వీరి సహజ లక్షణం. అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వీరు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. ఈ రాశిలో శని ఉన్నప్పుడు మాత్రం వీరిని కనివిని ఎరుగని బద్ధకం ఆవహిస్తుంది.

కర్కాటక రాశి

సాధారణంగా ఈ రాశి వారు నిత్య చైతన్య వంతులు. ఇంట్లో ఖాళీగా కూర్చోవడానికి ఇష్టపడరు. ఈ రాశి వారికి బయట తిరుగుతూ ఉండటం అంటే చాలా ఇష్టం. ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి మార్కెటింగ్, రాజకీయాలు, సినిమా, వ్యాపారాలు, ట్రావెలింగ్ వంటివి బాగా అచ్చి వస్తుంటాయి. బంధువులను స్నేహితులను కలుసుకోవడం అంటే ఈ రాశి వారు అందరికంటే ముందుంటారు. తీర్థ యాత్రలు విహార యాత్రలు అంటే వీరికి విపరీతంగా మక్కువ ఉంటుంది.

తులా రాశి

ఈ రాశి వారు సాధారణంగా ప్రయాణాలకు, తిరగటానికి అవకాశం ఉన్న ఉద్యోగాలను వ్యాపారాలను బాగా ఇష్టపడతారు. వీరికి శారీరకంగానే కాక మానసికంగా కూడా బిజీగా ఉండాలని కోరుకుంటారు. లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం. రోజుల తరబడి పనిచేయడానికి తిరగటానికి వీరిలో ఎంతో ఉత్సాహం ఎనర్జీ ఉంటుంది. సెలవు రోజున కూడా ఏదో ఒక పని మీద వేసుకొని తిరుగుతూ ఉంటారు. సాధారణంగా చిన్న చిన్న అనారోగ్యాలను ఏమాత్రం పట్టించుకోరు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక ఉద్యోగంలో చేరటం వీరికి అలవాటు.

ధనుస్సు రాశి

ఈ రాశి వారికి ఎనర్జీ చురుకుదనం ఉత్సాహం వంటి లక్షణాలు కొద్దిగా మోతాదు మించి ఉంటాయి. ఇతరుల పని భారం మీద వేసు కోవడానికి కూడా ముందుంటారు. ఎక్కువగా ఇతరుల కార్యకలాపాలు చక్కబెడుతుంటారు. ఏ పని లేకుండా ఖాళీగా కూర్చోవడం అంటే వీరు విసుగెత్తిపోతారు. సొంత పనులను కూడా అతివేగంగా అతి తక్కువ కాలంలో పూర్తి చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. ఉద్యోగంలో కూడా నలుగురి పనులు తాను ఒక్కడినే చేయటానికి ముందుకు వస్తూ ఉంటారు.
– కౌశిక్, ప్రముఖ జ్యోతిష్య పండితులు
Disclaimer: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.. 
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..