AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహాశివరాత్రి రోజున రాజయోగం.. ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారం.. మరి మీ రాశి ఉందా.?

గ్రహాల సంచారం.. రాశులు, నక్షత్రాల స్థానాలలో మార్పులు ఆధారంగా ఓ వ్యక్తి జీవితం ఎలా ఉండబోతోందన్నది జ్యోతిష్యులు అంచనా వేస్తుంటారు. ఇదిలా ఉంటే.. మనపై శివుని ఆగ్రహం ఉంటే.. జీవితంలోని దుఃఖాలు అన్ని తొలగిపోయి.. సుఖసంతోషాలు, ఆరోగ్య శ్రేయస్సు పొందుతామని అంటుంటారు.

మహాశివరాత్రి రోజున రాజయోగం.. ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారం.. మరి మీ రాశి ఉందా.?
Zodiac Signs
Ravi Kiran
|

Updated on: Feb 13, 2025 | 2:20 PM

Share

గ్రహాల సంచారం.. రాశులు, నక్షత్రాల స్థానాలలో మార్పులు ఆధారంగా ఓ వ్యక్తి జీవితం ఎలా ఉండబోతోందన్నది జ్యోతిష్యులు అంచనా వేస్తుంటారు. ఇదిలా ఉంటే.. మనపై శివుని ఆగ్రహం ఉంటే.. జీవితంలోని దుఃఖాలు అన్ని తొలగిపోయి.. సుఖసంతోషాలు, ఆరోగ్య శ్రేయస్సు పొందుతామని అంటుంటారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వస్తుంది. ఆరోజు ఉదయం 11.08 గంటలకు ప్రారంభమై.. ఫిబ్రవరి 27న ఉదయం 8.54 గంటల వరకు ఉంటుంది. శివరాత్రి పర్వదినం నాడు సూర్యుడు, చంద్రుడు, శని గ్రహాల కలయిక వల్ల త్రిగృహ యోగం ఏర్పడుతుంది. దీనికి కారణంగా మూడు రాశుల వారు అదృష్టాన్ని పొందుతారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

మేషరాశి

ఈ రాశివారికి మహాశివరాత్రి నుంచి మంచి కాలం మొదలవుతుంది. ఏది కావాలన్నా అది దొరుకుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందటమే కాదు.. జీతం పెరిగే అవకాశం కూడా ఉంది. అన్ని ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు. వ్యాపారాల్లోనూ లాభాలు ఆర్జిస్తారు.

మిథున రాశి

కొత్త వ్యాపారాలు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగాలలోనూ, వ్యాపారాల్లోనూ విజయం సాధిస్తారు. కెరీర్‌ను మెరుగుపరుచుకుంటారు. అలాగే ఉద్యోగంలో కొన్ని కీలకమైన బాధ్యతలను చేపడతారు.

సింహ రాశి

ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి జీతాలు పెరిగే ఛాన్స్, కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. అలాగే కొత్తగా ఆదాయ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సతీమణి నుంచి మద్దతు లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..