Raja Yoga: అనుకూల స్థితిలో రాశి అధిపతి.. ఆ రాశుల వారికి రాజయోగాలు పక్కా..!

| Edited By: Janardhan Veluru

Mar 21, 2024 | 7:05 PM

ఏ రాశికైనా రాశినాథుడు బలంగా ఉన్న పక్షంలో ఆ రాశివారికి చీకూ చింతా ఉండదు. ఏ సమస్య నుంచయినా బయటపడతారు. ఏ కోరికైనా నెరవేరుతుంది. జాతక చక్రంలో రాశినాథుడు లేదా లగ్నాధిపతి బలంగా, అనుకూల స్థానాల్లో ఉండడమనేది చాలా ముఖ్యం. రాశినాథుడు బలంగా ఉంటే అంతకు మించిన రాజయోగం మరొకటి ఉండదు.

Raja Yoga: అనుకూల స్థితిలో రాశి అధిపతి.. ఆ రాశుల వారికి రాజయోగాలు పక్కా..!
Raja Yoga 2024
Follow us on

ఏ రాశికైనా రాశినాథుడు బలంగా ఉన్న పక్షంలో ఆ రాశివారికి చీకూ చింతా ఉండదు. ఏ సమస్య నుంచయినా బయటపడతారు. ఏ కోరికైనా నెరవేరుతుంది. జాతక చక్రంలో రాశినాథుడు లేదా లగ్నాధిపతి బలంగా, అనుకూల స్థానాల్లో ఉండడమనేది చాలా ముఖ్యం. రాశినాథుడు బలంగా ఉంటే అంతకు మించిన రాజయోగం మరొకటి ఉండదు. గ్రహ సంచారంలో రాశినాథుడు అనుకూలంగా ఉన్న పక్షంలో శని దోషాలు, రాహు దోషాలు, కుజ దోషాలు ఏవీ వర్తించవు. ప్రస్తుతం గ్రహచారం ప్రకారం మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి రాశ్యధిపతి అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశుల వారి జీవితాలు యోగదాయకంగా గడిచిపోతాయి.

  1. మేషం: ఈ రాశికి నాథుడైన కుజుడు లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల యోగకారకుడయ్యాడు. వీరికి ఏప్రిల్ 23 వరకు జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ప్రతి పనీ ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తవుతుంది. మాట చెలామణీ అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సర్వత్రా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
  2. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు దశమ కేంద్రంలో, మిత్ర క్షేత్రంలో మిత్రుడితో కలిసి ఉన్నందు వల్ల బలవంతుడయ్యాడు. ఫలితంగా వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాబల్యం బాగా పెరుగుతాయి. ఈ నెలాఖరు వరకు వీరికి వ్యాపారాల్లో కూడా తిరుగుండదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజ కీయ ప్రముఖులతో పరిచయాలు బాగా వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశముంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది.
  3. మిథునం: ఈ రాశికి నాథుడైన బుధుడు దశమ కేంద్రంలో రవితో కలిసి ఉన్నందువల్ల బుధాదిత్య యోగం ఏర్పడి, వృత్తి, ఉద్యోగాలపరంగానే కాక, ఆర్థికంగా కూడా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. విదేశీ అవకాశాలు కూడా అందు తాయి. ఉద్యోగంలోనే కాక, ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ వేయడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. సర్వత్రా ప్రాభవం పెరుగుతుంది.
  4. తుల: ఈ రాశి నాథుడైన శుక్రుడు పంచమ స్థానంలో మిత్ర క్షేత్రంలో ఉండడం, పైగా మిత్రుడు శనితో కలిసి ఉండడం వల్ల ఈ రాశివారికి యోగదాయక ఫలితాలనిస్తాడు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాట వాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఆదాయం విషయంలోనూ, ఆర్థిక పరిస్థితి మెరుగుదల విష యంలోనూ ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా ఘన విజయం సాధిస్తారు. ప్రముఖులతో లాభదా యక పరిచయాలు ఏర్పడతాయి. ఎటువంటి వ్యక్తిగత సమస్య అయినా పరిష్కారం అవుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశినాథుడు గురువు పంచమ స్థానంలో, మిత్ర క్షేత్రంలో అనుకూల సంచారం చేస్తున్నందు వల్ల తప్పకుండా రాజయోగం పడుతుంది. ఏప్రిల్ 30వరకు ఈ రాశివారి మాటకు, చేతకు తిరు గుండదు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. శక్తి సామర్థ్యాలు బాగా మెరుగుపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో విశేషంగా రాబడి పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా సఫలం అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి.
  6. మకరం: ఈ రాశినాథుడైన శనీశ్వరుడు ద్వితీయ స్థానంలో, స్వక్షేత్రంలో బలంగా సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారికి చీకూ చింతా ఉండని జీవితం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగు తుంది. ఆర్థికంగా అంచనాలకు మించి పురోగతి చెందుతారు. కుటుంబ జీవితంలో ఎటువంటి పొర పచ్చాలు, మనస్పర్థలున్నా సమసిపోతాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి కూడా అదృష్టం పడుతుంది.
  7. మీనం: ఈ రాశినాథుడైన గురువు ధన స్థానంలో, అందులోనూ మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఏప్రిల్ 30 వరకూ వీరి ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ మెరుగుపడుతూనే ఉంటుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ముఖ్యులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంట్లో శుభ కార్యం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కు లోటుండదు.