Zodiac Signs In Telugu
ఈ నెల 17 నుంచి రవి, కుజులు కన్యా రాశిలో కలుస్తున్నాయి. వీటి యుతి అక్టోబర్ 3వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ రెండు గ్రహాలు విడివిడిగా ఉంటే సమస్యేమీ ఉండదు కానీ, కలిస్తే మాత్రం ఏదో ఒక ఉపద్రవం తెచ్చి పెట్టడం ఖాయం. నిజానికి, రవి, కుజులు మిత్రగ్రహాలు. అయితే, ఈ రెండు పాప గ్రహాలు ఒక రాశిలో కలవడం వీటితో పాపత్వం బాగా పెరుగుతుంది. దాంతో ఎక్కువ రాశులకు కష్టనష్టాలు తీసుకురావడం జరుగుతుంది. ఈ కలయిక వల్ల ఏ రాశుల వారికి ఏం జరుగుతుందో చూద్దాం.
- మేషం: ఈ రాశివారికి ఆరవ స్థానమైన కన్యా రాశిలో ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల కొంత మంచే జరుగుతుంది. ఇందులో కుజుడు రాశ్యధిపతి కావడం వల్ల కొంత చెడు తగ్గుతుంది. ఈ రాశివారికి ప్రభుత్వపరంగా అనేక ప్రయోజనాలు అందుతాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. అయితే, విపరీతంగా మొండితనం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. అహంకారానికి హద్దులుండవు. తండ్రితో, అధికారులతో వైరం ఏర్పడుతుంది.
- వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో ఈ రెండు గ్రహాలు కలుస్తున్నందువల్ల తాము పట్టుకున్న కుందే లుకు మూడే కాళ్లు అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఆలోచనలు, అభిప్రాయాలు విప్లవాత్మకంగా మారతాయి. పిల్లలకు కష్టనష్టాలు ఏర్పడతాయి. పిల్లలకు సంబంధించిన సమస్యలు పెరుగు తాయి. ప్రసవాలు కష్టమవుతాయి. సంప్రదాయ విరుద్ధంగా వ్యవహరిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో వ్యూహాలు, పథకాలు మార్చి లాభాల బాట పట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో మార్పు వస్తుంది.
- మిథునం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో ఈ రెండు గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల వాహన ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. గృహ, వాహన సౌకర్యాలకు అవకాశం ఉంది. రియల్టర్లకు బాగా కలిసి వస్తుంది. ఇల్లు మారడానికి, స్థాన చలనానికి అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో నెగ్గుతారు.
- కర్కాటకం: ఈ రాశికి మూడవ రాశిలో కుజ, రవుల కలయిక ఈ రాశివారికి ఎంతో లబ్ధి చేకూరుస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగపరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. అధికార యోగానికి అవ కాశం ఉంది. ప్రభుత్వ పరంగా ప్రయోజనాలు కలుగుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. సోదర వర్గంతో శత్రుత్వం ఏర్పడుతుంది. తండ్రితో తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది.
- సింహం: ఈ రాశివారికి ఈ రెండు గ్రహాల కలయిక బాగా యోగిస్తుంది. ఈ రాశినాథుడైన రవితో కుజ గ్రహం కలయిక వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా అదృష్టం పడుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది.
- కన్య: ఈ రాశివారికి ఈ కలయిక సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార, విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. శస్త్రచికిత్సలు జరిగే సూచనలున్నాయి. వైద్య ఖర్చులు పెరగవచ్చు. స్నేహితుల కారణంగా డబ్బు నష్టం జరగవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు లేదు కానీ, వృత్తి, ఉద్యోగాల్లో మాత్రం అధికారులతో ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. ప్రభుత్వపరంగా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజ, రవి గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల భారీగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రహస్య శత్రువులు తయారయి, ఇబ్బంది పెడతారు. అనవసర పరిచయాల వల్ల అప్రతిష్టపాలయ్యే అవకాశం ఉంది. వాహన ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మనశ్శాంతి తగ్గవచ్చు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి మాత్రం ఈ కలయిక వల్ల ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి.
- వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ రెండు గ్రహాలు కలవడం ఒక విధంగా అదృష్టమనే చెప్పాలి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తప్పకుండా పురోగతి ఉంటుంది. కుటుం బంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తండ్రికి కూడా యోగం పడుతుంది. ప్రభుత్వ పరంగా అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
- ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో ఈ కలయిక ఏర్పడడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. నిరుద్యోగులు కోరుకున్న కంపె నీలో, ఆశించిన ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తల్లితండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. కోర్టు కేసు అనుకూలిస్తుంది.
- మకరం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో ఈ గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల ప్రధానంగా ఉద్యోగావ కాశాలు, ఆదాయావకాశాలు పెరుగుతాయి. జీవితంలో అన్ని విధాలుగానూ స్థిరత్వం ఏర్పడడా నికి అవకాశం ఉంది. విదేశాలలో విద్య, ఉద్యోగావకాశాలకు అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. తండ్రి వైపు నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. అయితే, ఈ రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక తండ్రికి మంచిది కాదు. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
- కుంభం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో ఈ కలయిక ఏర్పడడం ఏమంత మంచిది కాదు. దీర్ఘకాలిక అనా రోగ్యాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఏదైనా మొండి వ్యాధి పీడించే అవకాశం ఉంది. ప్రయా ణాల వల్ల ఇబ్బంది పడతారు. విలువైన వస్తువులు నష్టపోయే సూచనలున్నాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. దైవ కార్యాల్లో, సహాయ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. జీవిత భాగస్వామికి ఈ గ్రహ యుతి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన పురోగతి ఉంటుంది.
- మీనం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే, వ్యాపార భాగస్వా ములతో విభేదాలు తలెత్తుతాయి. లాభాలు మందగిస్తాయి. జీవిత భాగస్వామితో కూడా సమస్యలు తలెత్తుతాయి. ఆహార, విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.