
శుక్రుడు తన సొంత రాశి అయిన తులారాశిలో సంచరిస్తుండగా, సూర్యుడు కూడా నవంబర్ 16 వరకు అదే రాశిలో కలసి ఉండటం ఈ యోగానికి ప్రధాన కారణం. దీని వలన మేషం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ఈ గ్రహ స్థితి కారణంగా వారికి ఆర్థిక వృద్ధి ఆస్తి లాభాలు కుటుంబ సంతోషాలు కలుగుతాయి.
తులారాశి సప్తమ స్థానంలో సూర్యుడు శుక్రుడు కలవడం వల్ల ఆస్తిపాస్తులు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు వేతనం పెరుగుతుంది. ప్రమోషన్ రావడం ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించడం వంటివి జరుగుతాయి. పెళ్లికోసం ఎదురు చూసే వారు శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి.
చతుర్థ స్థానంలో శుక్రుడు సూర్యుడు కలవడం వలన ఈ రాశి వారికి ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు శుభవార్త వింటారు. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల వల్ల లాభాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అనుకూల సమయం అని పండితులు చెబుతున్నారు.
ఈ రాశి అధిపతి శుక్రుడు ఇదే రాశిలో సూర్యుడితో కలవడం వలన ఈ రాశి వారికి జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు బాగా విస్తరిస్తాయి. సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.
ఈ రాశి లాభ స్థానంలో శుక్రుడు సూర్యుడు కలవడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతా మంచే జరుగుతుంది.
ఈ రాశి భాగ్య స్థానంలో శుక్రుడు సూర్యుడు సంచారం వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించే అవకాశం ఉంది. ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉద్యోగం మారేందుకు అనుకూల వాతావరణం కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. కుటుంబంలో ముఖ్యమైన శుభకార్యాలు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ వార్త జ్యోతిష్య పండితుల అంచనాల ఆధారంగా ఇవ్వబడింది. వ్యక్తిగత జాతకం నిర్ణయాలకు ముందు నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.