Sri Rama Navami: శ్రీ రామ నవమి రోజున రామయ్య ఆశీస్సులు పొందే మూడు రాశులు ఇవే.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..

శ్రీ రాముని జన్మదినాన్ని పురస్కరించుకుని రామ నవమి జరుపుకుంటారు. ఈసారి శ్రీ రామ నవమి ఏప్రిల్ 6వ తేదీన జరుపుకోనున్నారు. ఈ ఏడాది జ్యోతిషశాస్త్ర దృక్కోణంలో రామ నవమి చాలా ప్రత్యేకమైనది. ఈసారి రామ నవమి నాడు అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ మూడు రాశుల వ్యక్తులపై శ్రీ రాముని ప్రత్యేక ఆశీర్వాదాలు ఉండనున్నాయి. ఈ మూడు అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Sri Rama Navami: శ్రీ రామ నవమి రోజున రామయ్య ఆశీస్సులు పొందే మూడు రాశులు ఇవే.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..
Sri Rama 2025

Updated on: Apr 05, 2025 | 3:42 PM

శ్రీ రామ నవమి హిందూ మతంలో చాలా పవిత్రమైన, ప్రత్యేకమైన పండుగ. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్షంలోని తొమ్మిదవ రోజుని శ్రీ రామ నవమిగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్ష తొమ్మిదవ రోజున, శ్రీరాముడు అయోధ్య రాజు దశరథుని భార్య కౌసల్యకు జన్మించాడు. శ్రీ రామ నవమి పండుగను చైత్ర మాసంలోని శుక్ల పక్ష తొమ్మిదవ రోజున శ్రీరాముని జన్మదినంగా జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో శ్రీ రామ నవమి ఏప్రిల్ 6న జరుపుకోనున్నారు.

శ్రీ రామ నవమి రోజున శ్రీరాముడిని నియమ నిష్టలతో ఆచారాలతో పూజిస్తారు. రామనవమి రోజున రాముడిని పూజించే వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి ఉంటాయని నమ్ముతారు. ఈసారి రామనవమిని జ్యోతిషశాస్త్రం దృక్కోణంలో కూడా చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే రామ నవమి పుష్య నక్షత్రం రోజున జరుపుకోనున్నారు. కనుక ఈ రోజు జ్యోతిషశాస్త్రంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. దీనితో పాటు సుకర్మ, ధృతి, సర్వార్థ సిద్ధి యోగాల కలయిక కూడా ఈ రోజున ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈసారి రామ నవమి రోజున కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు శ్రీరాముని ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చు. ఈ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

మేషరాశి: ఈ రాశి వారికి శ్రీ రామ నవమి రోజు చాలా శుభప్రదంగా ఉండనుంది. మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు. వ్యాపారవేత్తలకు వ్యాపారంలో లాభాలు అందుకోనున్నారు. ఉద్యోగుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉండవచ్చు. కుటుంబంలో వాతావరణం బాగుంటుంది.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: ఈ రాశి వారి జీవితాల్లో రామనవమి రోజు ఆనందాన్ని తెస్తుంది. కర్కాటక రాశి వారు కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది. కుటుంబ సమస్యల నుంచి వీరు విముక్తి పొందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నారు. సమాజంలో కీర్తి , ప్రతిష్ట పెరగవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించవచ్చు.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి శ్రీ రామనవమి రోజు చాలా ప్రత్యేకమైనది. ఉద్యోగస్తులకు వారి కెరీర్‌లో కొత్త అవకాశాలు లభించవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అయ్యే అవకాశం ఉంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us