Shukra Shani Yuti: త్వరలో శని, శుక్రుల కలయిక.. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

|

Nov 29, 2024 | 11:36 AM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు, రాశులకు విశిష్ట స్థానం ఉంది. గ్రహాల కలదలికల వలన మానవుల జీవితంలో మంచి చెడులు ఏర్పడతాయి. అయితే కర్మ ఫల దాత శనీశ్వరుడు, రాక్షస గురువు శుక్రుడు త్వరలో కలయనున్నారు. ఈ కలయిక కొన్ని రాశులకు చెందిన వారికి చాలా అదృష్టాన్ని కలుగుజేస్తుంది. ఈ రాశుల వారికి ఆర్థిక లాభం చేకూరే అవకాశాలున్నాయట.

Shukra Shani Yuti: త్వరలో శని, శుక్రుల కలయిక.. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
Shukra Shani Yuti 2024
Follow us on

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాయి. దీనితో పాటు ఇలా రాశులను మార్చుకునే సమయంలో కొన్నిసార్లు గ్రహాలు ఇతర గ్రహాలతో కలుస్తాయి. ఇలా గ్రహాలు కలవడంతో వ్యక్తులతో జీవితంలో ప్రభావం కనిపిస్తుంది. త్వరలో కుంభరాశిలో శనీశ్వరుడు, శుక్రుల కలయిక ఉండబోతోంది. 2024వ సంవత్సరం చివరలో ఫలితాలను ఇచ్చే శనీశ్వరుడు, సంతోషాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఇద్దరూ కలవనున్నారు. ఈ కలయిక మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. వీటి కలయిక వలన కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.

శని, శుక్రుల కలయిక ఎప్పుడంటే

పంచాంగం ప్రకారం శనీశ్వరుడు, రాక్షస గురువు శుక్రుడు ఇద్దరూ డిసెంబర్ 28, 2024న రాత్రి 11:48 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ కలయిక దాదాపు 1 నెల పాటు కొనసాగుతుంది. అంటే వీరిద్దరూ జనవరి 28, 2025 ఉదయం 7:12 వరకు కుంభ రాశిలో ఉండనున్నారు.

ఏ రాశుల వారికి లాభాలు అంటే

వృషభ రాశి : శనీశ్వరుడు, శుక్ర గ్రహాలను స్నేహపూర్వక గ్రహాలుగా పరిగణిస్తారు. ఈసారి వృషభ రాశి వారు శని, శుక్రుల కలయిక వలన 2024 సంవత్సరం చివరిలో చాలా ప్రయోజనం పొందబోతున్నారు. ఈ రాశుల వారికి కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో పురోగతితో ఆర్థిక లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆగిన పనులు కూడా పూర్తి చేస్తారు.

ఇవి కూడా చదవండి

తులారాశి: శని, శుక్రుల కలయిక వలన తుల రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అదృష్టం ఈ రాశికి ఎన్నో సంతోషకరమైన వార్తలు తీసుకొస్తుంది. కెరీర్‌లో ఉన్నత స్థాయిని సాధించగలరు. విద్య లేదా కష్టమైన పరీక్ష ఫలితాలు ఈ రాశికి చెందిన స్టూడెంట్స్ కు అనుకూలంగా ఉండవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం ప్రారంభంలో వారసత్వ ఆస్తులు పొందే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. వీరికి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.

కుంభ రాశి: శని, శుక్రుల కలయిక కుంభరాశిలో జరగనుంది. దీని కారణంగా కుంభ రాశి వారికి ఈ కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కుంభ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్‌తో పాటు జీతం పెరుగుతుంది. జీవితంలో విలాసాలు, సుఖాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదన రావచ్చు. అంతేకాదు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.