Shukra Gochar 2024: మిథున రాశిలో శుక్ర గ్రహం.. ఆ రాశుల వారికి అత్యధిక శుభ ఫలితాలు పక్కా..!

| Edited By: Janardhan Veluru

Jun 10, 2024 | 3:57 PM

ఈ నెల 13వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు శుక్ర గ్రహం మిథున రాశిలో కొనసాగుతుంది. మిథున రాశి ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి సంబంధించిన రాశి. ఈ రాశిలో పుట్టిన వారు ఒకేసారి రెండు మూడు విషయాలను ఆలోచించగల సమర్థులు. ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, సుఖ సంతోషాలు, ఆదాయానికి సంబంధించిన శుక్ర గ్రహం ఈ రాశిలో ప్రవేశించడం వల్ల కొందరి జీవితాల్లో చిత్ర విచిత్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి.

Shukra Gochar 2024: మిథున రాశిలో శుక్ర గ్రహం.. ఆ రాశుల వారికి అత్యధిక శుభ ఫలితాలు పక్కా..!
Shukra Gochar 2024
Follow us on

ఈ నెల 13వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు శుక్ర గ్రహం మిథున రాశిలో కొనసాగుతుంది. మిథున రాశి ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి సంబంధించిన రాశి. ఈ రాశిలో పుట్టిన వారు ఒకేసారి రెండు మూడు విషయాలను ఆలోచించగల సమర్థులు. ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, సుఖ సంతోషాలు, ఆదాయానికి సంబంధించిన శుక్ర గ్రహం ఈ రాశిలో ప్రవేశించడం వల్ల కొందరి జీవితాల్లో చిత్ర విచిత్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధించడం జరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ప్రయాణాల ద్వారా అదృష్టం పండుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. శుక్రుడు మిథున రాశి ప్రవేశం వల్ల వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశుల వారు అత్యధికంగా శుభ ఫలితాలను పొందుతారు.

  1. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ధన స్థానంలో ప్రవేశించడం వల్ల ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ప్రేమ వ్యవ హారాల్లో విజయం సాధించడం జరుగుతుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
  2. మిథునం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ఈ రాశిలో సంచారం ప్రారంభించడం వల్ల కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వినడం, పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. అనవసర పరిచయాలు, వ్యసనాల నుంచి బయటకు రావడం జరుగు తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యతలు పెరుగుతాయి.
  3. సింహం: ఈ రాశివారికి లాభ స్థానంలో శుక్ర సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.
  4. కన్య: ఈ రాశికి దశమ స్థానంలోకి శుక్ర గ్రహం ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరు గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. లాభాల బాటపడతాయి. నిరుద్యోగు లకే కాకుండా ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అంది వస్తాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివా దాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది.
  5. తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల విదేశాల్లో ఉద్యోగం రావడం, విదేశీ యానానికి మార్గం సుగమం కావడం వంటివి జరుగుతాయి. విదేశాల్లో స్థిర నివాసం లభిస్తుంది. పెళ్లి కాని వారికి విదేశీ సంబంధం ఖాయమవుతుంది. తల్లితండ్రుల నుంచి ఆస్తిపాస్తులు లేదా సంపద లభించే అవకాశం ఉంది. తల్లి లేదా భార్య ద్వారా అదృష్టం పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయడానికి అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
  6. కుంభం: ఈ రాశికి పంచమ కోణంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో ప్రాభవం బాగా పెరుగుతుంది. వృత్తిపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. జీవితంలో ఆశించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవనశైలి బాగా మారిపోతుంది. సంతానం లేనివారికి సంతాన యోగం కలుగుతుంది. పిల్లలు కూడా చదువుల్లోనూ, ఉద్యోగా ల్లోనూ ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. ఆశించిన గుర్తింపు లభించే అవకాశం ఉంది.