Shukra Gochar 2023: తులా రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి భోగభాగ్యాలు.. !

| Edited By: Janardhan Veluru

Nov 28, 2023 | 7:07 PM

భోగభాగ్యాలకు, శృంగారానికి, ప్రేమలు, పెళ్లిళ్లకు కారకుడైన శుక్రుడు ఈ నెల 30 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ రాశి మార్పు వల్ల నష్టపోయే రాశి లేదు. దాదాపు ప్రతి రాశీ ఏదో ఒక ప్రయోజనం పొందుతుంది. అయితే, వృషభం, సింహం, వృశ్చికం, మీన రాశుల వారికి దీని వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు కానీ, మిగిలిన రాశుల వారికి జీవితాలలో మాత్రం తప్పకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Shukra Gochar 2023: తులా రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి భోగభాగ్యాలు.. !
Shukra Gochar 2023
Follow us on

భోగభాగ్యాలకు, శృంగారానికి, ప్రేమలు, పెళ్లిళ్లకు కారకుడైన శుక్రుడు ఈ నెల 30 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ రాశి మార్పు వల్ల నష్టపోయే రాశి లేదు. దాదాపు ప్రతి రాశీ ఏదో ఒక ప్రయోజనం పొందుతుంది. అయితే, వృషభం, సింహం, వృశ్చికం, మీన రాశుల వారికి దీని వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు కానీ, మిగిలిన రాశుల వారికి జీవితాలలో మాత్రం తప్పకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో సప్తమ స్థానాధిపతి అయిన శుక్రుడు ప్రవేశించడం వల్ల మాలవ్య మహాపురుష యోగం ఏర్పడుతోంది. దీనివల్ల ఆస్తులు కొనడం, ఆస్తులు పెరగడం, గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అయి, పెళ్లికి దారి తీస్తాయి. వైవాహిక బంధం పటిష్టమవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. అన్ని విధాలుగానూ ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ఒక ప్రముఖ వ్యక్తిగా చెలామణి అవుతారు.
  2. వృషభం: ఈ రాశ్యధిపతి అయిన శుక్రుడు స్వస్థానంలోకి రావడం బాగానే ఉంటుంది కానీ, అది ఆరవ స్థానం కావడం వల్ల వృత్తి, ఉద్యోగాలతో పాటు, ఇతరత్రా కూడా బాగా ఒత్తిడి ఉండడం, ఏ పనీ ఒకపట్టాన సానుకూలపడకపోవడం వంటివి జరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో కూడా చిన్నా చితకా సమస్యలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు మాత్రం సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. అనారోగ్యాల నుంచి బయటపడడం జరుగుతుంది.
  3. మిథునం: ఈ రాశివారికి పంచమ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. విలాస జీవితానికి అలవాటు పడతారు. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి.
  4. కర్కాటకం: ఈ రాశికి నాలుగవ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహాపురుష యోగం ఏర్పడింది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లే అవ కాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. గృహ, వాహన సౌకర్యాలు అమ రుతాయి. తల్లితండ్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. సామాజిక హోదా ఏర్పడుతుంది. పిల్లలు చదువుల్లోనే కాకుండా, పోటీ పరీక్షల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు. ఆస్తి కలిసి వస్తుంది.
  5. సింహం: ఈ రాశివారికి మూడవ స్థానంలో శుక్రుడి ప్రవేశం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనూ, ఆర్థికంగానూ ఆశించిన పురోగతి ఉంటుంది. కొందరు బంధుమిత్రులు మోసగించే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కొంత వరకే విజయం సాధించడం జరుగుతుంది. ప్రయాణాలు ఒక మోస్తరుగా లాభి స్తాయి. తోబుట్టువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో కొద్దిగా నిరుత్సాహం తప్పక పోవచ్చు. అనవసర స్నేహాలతో ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.
  6. కన్య: ఈ రాశికి ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి శుక్రుడు ప్రవేశించడం వల్ల తప్పకుండా ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. తండ్రి వైపు నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
  7. తుల: ఈ రాశిలోకి ఈ రాశినాథుడైన శుక్రుడు ప్రవేశించడం వల్ల మాలవ్య మహా పురుష యోగమైనే ఒక గొప్ప యోగం ఏర్పడింది. దీని వల్ల ఏ రంగానికి చెందినవారైనా ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరిగి, ఒక ప్రముఖ వ్యక్తిగా చెలామణీ కావడం జరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు వాటంతటవే పరిష్కారం అవుతాయి. ప్రేమ, వివాహ బంధాలు పటిష్టం అవుతాయి.
  8. వృశ్చికం: ఈ రాశికి వ్యయ స్థానంలో వ్యయాధిపతి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఆదాయం కంటే ఖర్చులు అధికం అవుతాయి. శుభ కార్యాల మీద కూడా ఖర్చు పెరుగుతుంది. తీర్థయాత్రలు లేదా విహార యాత్రలు చేయడం జరుగుతుంది. విలాస జీవితం, వ్యసనాలు అలవాటయ్యే అవకాశం కూడా ఉంది. విదేశాల నుంచి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు అందుతాయి. లాయర్లకు, డాక్టర్లకు ప్రాభవం, డిమాండు బాగా పెరుగుతాయి. స్నేహితులు మోసం చేసే అవకాశం కూడా ఉంది.
  9. ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల తప్పకుండా ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా, ఆశాజనకంగా ఉంటుంది. సోదరుల సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి కావడంతో పాటు కీలక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  10. మకరం: ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ తప్పకుండా ప్రాధాన్యం పెరుగుతుంది. ఒక ప్రముఖ వ్యక్తిగా చెలామణీ అవడం జరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యో గాలలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ఇష్టపడిన ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విలాస జీవితం అలవాటవుతుంది.
  11. కుంభం: ఈ రాశికి నవమ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల స్త్రీ మూలక ధన లాభం తప్పకుండా ఉంటుంది. సతీమణి లేదా తల్లి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తండ్రితో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. విదేశాలకు వెళ్లడానికి సంబంధించి అవకాశాలు మెరుగుపడతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగుతాయి. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
  12. మీనం: ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల సతీమణికి యోగం పడుతుంది. సతీమణి తరఫు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. అనవసర పరిచయాలు వల్ల దెబ్బతినే సూచన లున్నాయి. వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణాల్లో డబ్బు గానీ విలువైన వస్తువులు గానీ కోల్పోయే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగి ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.