Money Astrology: శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!

Saturn-Sun Conjunction: మీన రాశిలో శని, సూర్యుని యుతి కారణంగా కొన్ని రాశుల వారిపై అనుకూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ గుర్తింపు, ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య పురోగతి వంటి శుభ ఫలితాలు ఈ రాశుల వారికి లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాల పరిష్కారం, వృత్తిపరమైన అభివృద్ధి కూడా ఈ కాలంలో సంభవిస్తుంది. ఈ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులకు విపరీతమైన రాజయోగాలు కూడా పట్టనున్నాయి.

Money Astrology: శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!
Money Astrology 2025

Edited By: Janardhan Veluru

Updated on: Apr 02, 2025 | 7:08 PM

Telugu Astrology: మీన రాశిలో ప్రస్తుతం శని, రవులు కలిసి ప్రయాణం సాగిస్తున్నాయి. ఈ నెల 13న రవి మేష రాశిలోకి మారుతున్నందువల్ల ఆ రోజు వరకూ శని, రవులు మీన రాశిలో కలిసే ఉంటాయి. శని రవులు తండ్రీ కొడుకులు. అయితే, వీటి మధ్య బద్ధ వైరం నెలకొని ఉంటుంది. ఈ గ్రహాలు ఎక్కడ కలిసినా కొన్ని రాశులకు పోటాపోటీగా యోగాలు కలుగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశులకు ఈ రెండు గ్రహాలు కలిసి ఐశ్వర్యవంతులను చేసే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి మీ సమర్థతకు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారానే కాక, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా కూడా విశేషంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
  2. మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో రవి, శనుల కలయిక వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి చాలా వరకు కోలుకోవడం జరుగుతుంది. ఉద్యోగులకు, నిరు ద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు బాగా అనుకూలమవుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో శని, రవుల కలయిక వల్ల ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రావలసిన సొమ్ముతో పాటు, మొండి బాకీలను కూడా రాబట్టుకుంటారు. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. ప్రభుత్వపరంగా ఆశించిన గుర్తింపు పొందుతారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది.
  4. తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో శని, రవుల కలయిక విపరీత రాజయోగాలను కలిగిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు ఆర్థిక సమస్యలు, ఇతర కష్టనష్టాల నుంచి బయటపడడానికి అవకాశాలు లభిస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శని, రవుల యుతి వల్ల ఆస్తిపాస్తుల సమస్యలు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్ని హిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి మరింత మంచి ఉద్యో గానికి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి.
  6. మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో శని, రవుల కలయిక వల్ల రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభాలనిస్తాయి. ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు.