ఒక్క రోజులో వారి జీవితం అంత మారబోతుందా..? 12 రాశుల వారికి నేటి రాశిఫలాలు

ఈ రోజు రాశుల ఫలితాల్లో ఎక్కువగా సానుకూలత కనిపిస్తోంది. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు తెరుచుకుంటూ, ఆదాయం పెరుగుదలకు మార్గం సుగమమవుతోంది. కొన్ని రాశుల వారికి పనిభారం, ఒత్తిడి ఉన్నా లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా పురోగతి కనిపించినప్పటికీ ఖర్చులపై నియంత్రణ అవసరం.

ఒక్క రోజులో వారి జీవితం అంత మారబోతుందా..? 12 రాశుల వారికి నేటి రాశిఫలాలు
Daily Horoscope

Edited By:

Updated on: Apr 10, 2026 | 7:20 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు చేతికి అందు తాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. బంధువుల నుంచిశుభ కార్యాల ఆహ్వానాలు అందుతాయి. తలపెట్టిన పనులు సజావుగా సాగిపోతాయి. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సానుకూల ఆకస్మిక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ప్రయా ణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు ఇష్టమైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో కొత్త పద్ధతులు, ప్రక్రియలు ప్రవేశపెడ తారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు బాగారాణిస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. లాభాలపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆస్తి వివాదం ఒకటి తొలగిపోతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడం మీద శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు, కార్యకలాపాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితంలో పనిభారం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకోగ లుగుతారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం బాగుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అలవికాని లక్ష్యాలతో ఇబ్బంది పడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. కొందరు బంధుమిత్రులు సహాయ సహకారాలు అందజేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. విలాసాల మీద ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేయడం, దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి లోటుండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబప రంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆర్థిక విషయాల్లో మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రధానమైన కార్యక లాపాలను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువు లతో కొద్దిగా సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటివి ఆశించిన ఫలితాలనిస్తాయి. బంధుమిత్రులతో  శుభ కార్యంలో పాల్గొంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కానీ, ఇతరులకు సహాయం చూసే విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవు తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల సమా ధానం లభిస్తుంది. సమాజంలో విశేషమైన ఆదరణ పొందుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచ యాలు పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇతరుల విమర్శలను పట్టించు కోవద్దు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయం వృద్ది చెందుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలపరంగా అధిక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి, గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, ప్రయత్నాలు లాభాలను తెచ్చిపెడతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదే వీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

 

Follow Us