Aquarius Horoscope 2024: ఈ ఏడాది ఈ రాశి వారికి శుభ సమయం.. విద్య, కెరీర్, వ్యాపారం, ఆరోగ్యం ఎలా ఉంటుందంటే..

|

Jan 01, 2024 | 7:09 AM

కుంభ రాశికి చెందిన వారు కొత్త సంవత్సరం 2024 లో అన్ని విధాలా బాగుంటుందని ఉద్యోగస్తులకు జనవరి నెలలో ప్రమోషన్ లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. అంతేకాదు కొత్త ఇల్లు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. జూలై నుంచి ఆగస్టు మధ్య కాలంలో  చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయి. రాజకీయ నేతలు పదవులను పొందే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలం కలిసి వస్తుంది.

Aquarius Horoscope 2024: ఈ ఏడాది ఈ రాశి వారికి శుభ సమయం.. విద్య, కెరీర్, వ్యాపారం, ఆరోగ్యం ఎలా ఉంటుందంటే..
Aquarius Horoscope 2024
Follow us on

కొత్త సంవత్సరం 2024లో అడుగు పెట్టాం..ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదికి తమకు ఎలా ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలని కోరుకుంటారు. అదే సమయంలో జీవితం ఎటువంటి వివాదాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలని భావిస్తారు. కొత్త ఏడాదిలో తమ కెరీర్, ఆరోగ్యం, ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గత ఏడాది 2023తో పోలిస్తే ఈ ఏడాది అన్ని విధాలా బాగుంటుందని జ్యోతిష్కులు అంచనా వేశారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యల నుంచిబయటపడే  అవకాశం ఉంది. ఈ ఏడాదిలో సుఖ సంతోషాలతో జీవిస్తారని జ్యోతిష్యులు చెప్పారు.

కుంభ రాశికి చెందిన వారు కొత్త సంవత్సరం 2024 లో అన్ని విధాలా బాగుంటుందని ఉద్యోగస్తులకు జనవరి నెలలో ప్రమోషన్ లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. అంతేకాదు కొత్త ఇల్లు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. జూలై నుంచి ఆగస్టు మధ్య కాలంలో  చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయి. రాజకీయ నేతలు పదవులను పొందే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు ఏడాది చివర్లో  లాభాలను పొందే అవకాశం ఉంది.

వ్యాపారస్తులకు ఈ ఏడాది కలిసి వస్తుంది. ఏ రంగంలో ఉన్నవారైనా సరే సక్సెస్ అందుకుంటారు. లాభాలను పొందుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించేవారికి ఏప్రిల్ నుంచి జూలై  వరకూ శుభ సమయం అని చెప్పవచ్చు. ఏప్రిల్ నెలలో మంచి లాభాలను అందుకుంటారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వ్యాపారం అంతగా కలిసి రాదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

జనవరి నెల అన్ని విధాలుగా బాగుంటుంది. ఆస్థి కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ ఆస్థి కొనుగోలుకు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకూ ఆచితూచి అడుగు వెయ్యాలి. ఒకవేళ ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనీ భావిస్తే.. మే నుంచి జూన్ మధ్య కాలం శుభ సమయం అని చెప్పవచ్చు.

కుంభ రాశికి చెందిన వ్యక్తులకు ఆదాయ మార్గాలు పెరిగి.. ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. అయితే ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు చేస్తూ.. కొత్త ఏడాదిలో ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం ఉంది.

ఈ రాశికి చెందిన వారి ఆరోగ్యం కొత్త ఏడాదిలో బాగుంటుంది. ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు.. మెరుగైన స్థితిలో ఉండడం వలన ఆరోగ్యంగా ఉంటారు. తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు, యోగ, వ్యాయామం వంటి పద్ధతులు పాటించాల్సి ఉంటుంది.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చాలా వరకూ అనుకూలంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అన్నా చెల్లెళ్ళ మధ్య బంధం బలపడుతుంది. కుటుంబ సభ్యులతో మే నెలలో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు