Sudden Luck: చంద్ర కేతువుల యుతి..వారికి ఆకస్మిక శుభాలు, అదృష్ట యోగాలు..!

Moon - Keetu Yuti: ఏప్రిల్ 26–28 తేదీల్లో సింహ రాశిలో చంద్ర–కేతు యుతి సంభవించనుంది. దీని ప్రభావంతో మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఆత్మవిశ్వాసం పెరగనుంది. ఫలితంగా ఆకస్మిక శుభ ఫలితాలు, అదృష్టయోగాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Sudden Luck: చంద్ర కేతువుల యుతి..వారికి ఆకస్మిక శుభాలు, అదృష్ట యోగాలు..!
Sudden Luck

Edited By:

Updated on: Apr 25, 2026 | 12:44 PM

ఈ నెల(ఏప్రిల్) 26, 27, 28 తేదీల్లో సింహ రాశిలో చంద్ర కేతువుల యుతి జరుగుతోంది. ఈ యుతి వల్ల కొన్ని రాశుల వారి ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మొండి పట్టుదలతో వ్యవహరించడం జరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీటన్నిటి వల్ల వీరి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులకు ఇది యోగ దాయకంగా మారుతుంది. ఆకస్మిక శుభ యోగాలు, శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి. అలాగే కొన్ని అదృష్ట యోగాలు పట్టబోతున్నాయి.

  1. మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో చోటు చేసుకుంటున్న చంద్ర, కేతువుల యుతి వల్ల ఆదాయాన్ని పెంచుకుని, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి, ముఖ్యమైన అవసరాలు తీర్చుకోవడానికి నడుం బిగిస్తారు. రావలసిన సొమ్మును రాబట్టుకోవడంతో పాటు, మొండి బాకీలు, బకాయిలు వసూలు చేసుకుంటారు. ఉచిత సహాయాలకు, దానధర్మాలకు స్వస్తి చెబుతారు. షేర్లు, స్పెక్యులేషన్లలో మదుపు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు.
  2. మిథునం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఏర్పడుతున్న చంద్ర, కేతువుల యుతి వల్ల సరైన ఉద్యోగం కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నాలు సాగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరచుకుంటారు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంది.
  3. సింహం: ఈ రాశిలో చంద్ర, కేతువుల యుతి వల్ల ఆదాయాన్ని పెంచుకోవడం మీదా, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం మీదా ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎక్కువగా శ్రమపడడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. స్నేహ సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి, వ్యాపారాలు మీ నిర్ణయాలతో లాభాల బాట పడతాయి.
  4. తుల: ఈ రాశికి లాభ స్థానంలో సంభవిస్తున్న చంద్ర కేతువుల కలయిక వల్ల ఉద్యోగ మారడానికి గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం మీద దృష్టి పెడతారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టి లాభాలు గడిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కొద్ది ప్రయత్నంతో ఆదాయం అత్యధికంగా వృద్ధి చెందే అవకాశం ఉంది.
  5. ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్ర, కేతువులు కలుస్తున్నందువల్ల అభివృద్ధికి, పురోగతికి తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తారు. నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారు. ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలను అనుసరిస్తారు. బంధు మిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో అధికారులను పనితీరుతో మెప్పించి పదోన్నతి పొందుతారు. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి బాగా పురోగమిస్తాయి. నిరుద్యోగులు, అవివాహితులు తప్పకుండా ఆశించిన శుభవార్తలు వింటారు.
  6. కుంభం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో చంద్రుడు, కేతువు కలవడం వల్ల కోరుకున్న వ్యక్తితో పెళ్లి కావడానికి అవకాశం ఉంది. వైవాహిక జీవితంలోని సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో విభేదాలు తొలగిపోతాయి. విదేశీ ఉద్యోగాలను సంపాదించుకుంటారు. కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగడం వల్ల దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు సైతం పరిష్కారమవుతాయి. మాట తీరును మార్చుకుంటారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us