Mercury Enters Capricorn: మకరరాశిలోకి ‘ప్రిన్స్’.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే! మరి మీ రాశిఫలం తెలుసుకోండి

Zodiac Signs: మకర రాశిలో బుధ గోచారం సమయంలో మాటల్లో సంయమనం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడం ఎంతో కీలకమని జ్యోతిష్కులు సూచిస్తున్నారు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని వారు అంటున్నారు. బుధ గోచారంతో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

Mercury Enters Capricorn: మకరరాశిలోకి ‘ప్రిన్స్’.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే! మరి మీ రాశిఫలం తెలుసుకోండి
Mercury Enters Capricorn

Updated on: Jan 17, 2026 | 10:49 AM

జ్యోతిష్యశాస్త్రం గ్రహాల సంచారం, వాటి వల్ల రాశులపై కలిగే ప్రభావాల గురించి వివరిస్తుంది. ఇప్పుడు గ్రహాల యువరాజుగా చెప్పబడే బుధుడు సంచారం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలివితేటలు, వ్యాపారంలో లాభనష్టాలను బుధుడే నిర్ణయిస్తాడు. అందుకే బుధుడు తరచుగా తన స్థానాన్ని మార్చకుంటాడు. జనవరి 17వ తేదీ మధ్యాహ్నం 12.58 గంటలకు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు. బుధగ్రహం స్థానం మారడంతో 12 రాశులపైనా ప్రభావం ఉంటుంది. అయితే, బుధసంచారంతో 3 రాశుల వారికి మాత్రం అనేక లాభాలను కలగజేస్తున్నాడు బుధుడు.

శని ఆధిపత్యంలో ఉన్న మకర రాశిలో బుధుడి సంచారం వల్ల క్రమశిక్షణ, బాధ్యత, ఉద్యోగ–వ్యాపారాలపై దృష్టి మరింత పెరుగుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఈ గోచారం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు లభించనున్నప్పటికీ, మరికొన్ని రాశులు ఓర్పు, జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. మేష రాశి: మకర రాశిలోకి బుధ సంచారం వల్ల మేష రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగ మార్పు లేదా పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరిగి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. కొత్తగా పెట్టుబడి పెడితే నాలుగు రెట్ల లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
  2. వృషభ రాశి: మకర రాశిలోకి బుధ సంచారం వల్ల వృషభరాశి వారికి కొన్ని సానుకూల ఫలితాలు ఉన్నాయి. కానీ, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ప్రేమ, పెళ్లి విషయాలను వాయిదా వేసుకోడం మంచిది.
  3. మిథున రాశి: మకర రాశిలోకి బుధ సంచారం వల్ల మిథునరాశి వారికి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రేమ, పెళ్లి విషయాల్లో జాగ్రత్త అవసరం.
  4. కర్కాటక రాశి: మకర రాశిలోకి బుధ సంచారం వల్ల కర్కాటక రాశి వారికి
    ఉద్యోగ రంగంలో సవాళ్లు ఎదురవుతాయి. ఓర్పుతో పనిచేస్తే ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక, వృత్తి పరంగా ఒత్తిడి ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా కనిపిస్తాయి.
  5. సింహ రాశి: మకర రాశిలోకి బుధ సంచారం వల్ల సింహ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు, పదోన్నతి, ఆదాయం పెరుగుతాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది.ఉద్యోగ, వ్యాపారస్తులు ఆర్థికంగా లాభపడతారు. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే, ఎవరికీ మధ్యవర్తిగా ఉండవద్దని, ఎలాంటి హామీలు ఇవ్వవద్దు.
  6. కన్యా రాశి: మకర రాశిలోకి బుధ సంచారం వల్ల కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో నెమ్మదిగా లాభాలు వస్తాయి. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ దొరుకుతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
  7. తులా రాశి: మకర రాశిలోకి బుధ సంచారం వల్ల ఆర్థిక లావాదేవీలు, వ్యాపార ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. మాటల వల్ల అపార్థాలు రాకుండా చూసుకోవాలి. సంయమనం పాటిస్తే సమస్యలు తగ్గుతాయి. జీవిత భాగస్వామితో వాదనలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత తగ్గుతుంది. ప్రతి విషయంలోనూ సహనం పాటిస్తే చివరకు అంతా మంచే జరుగుతుంది.
  8. వృశ్చిక రాశి: మకర రాశిలోకి బుధ సంచారం వల్ల ఉద్యోగ ఒత్తిడి పెరుగుతుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఆన్‌లైన్ లావాదేవీల్లో, కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి. కెరీర్ విషయంలో కొంత ఆందోళనకర వాతావరణం ఉంటుంది. ప్రేమ, పెళ్లి విషయాలను వాయిదా వేయండి.
  9. ధనుస్సు రాశి: మకర రాశిలోకి బుధ సంచారం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగ మార్పు లేదా బదిలీ అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాల సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణ యోగం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. మీలోని నాయకత్వ లక్షణాలు ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. వీసా, పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి అనుకూలం.
  10. మకర రాశి: మీ రాశిలోనే బుధుడు గోచారం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఆస్తి, వాహన యోగం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. డబ్బు సమస్యలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
  11. కుంభ రాశి: మకర రాశిలోకి బుధ సంచారం వల్ల కుంభరాశివారికి సానుకూల ఫలితాలున్నాయి. ఆగిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. మీరు తీసుకునే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. కొత్త వేతనం పెరుగుతుంది. మీరు ఆశించిన జాబ్ దొరుకుతుంది. తొందరపడి ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. వ్యక్తిగత సంబంధాల్లో వివాదాలు రాకుండా జాగ్రత్త అవసరం.
  12. మీన రాశి: మకర రాశిలోకి బుధ సంచారం వల్ల మీన రాశి వారికి కష్టపడితేనే ఫలితం కనిపిస్తుంది. ఆదాయం మితంగా ఉంటుంది. పోటీ పరిస్థితుల్లో ఓర్పు అవసరం. ఆరోగ్యం, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నందున వీరు కొత్త సహనం ప్రదర్శించడం మంచిది.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9 తెలుగు ధృవీకరించదు.)