
అన్ని గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రరాశులను మార్చుకుంటారు. ఇలా గ్రహాల మార్పు వలన మొత్తం సమస్త ప్రజలపై అంటే మొత్తం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. మే నెలలో అంగారక గ్రహం తన గమనాన్ని మార్చుకోబోతోంది. ఈ సంచారం వలన కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు చాలా శుభప్రదంగా ఉండనుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. ఈ సమయంలో రాశులకు చెందిన వ్యక్తుల కెరీర్, వ్యక్తిగత జీవితంలో పెద్ద మార్పులు సంభవించవచ్చు.
అంగారక గ్రహ సంచారం
ఈ అంగారక గ్రహ సంచారము 2025 మే 12న ఉదయం 8:55 గంటలకు జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రంలో అడుగు పెట్టనున్నాడు. తర్వాత కుజుడు జూన్ 7, 2025 వరకు ఆశ్లేష నక్షత్రంలో ఉంటాడు.
కుజ సంచార ప్రభావం
ఆశ్లేష నక్షత్రానికి కర్కాటక రాశి అధిపతిగా , గ్రహాలకు రాకుమారుడు బుధుడు ఆశ్లేష నక్షత్ర అధిపతిగా పరిగణించబడతారు. తెలివితేటలు, ప్రసంగం, వ్యాపారం , కమ్యూనికేషన్‌ను నియంత్రిస్తుంది. ఈ కారణంగానే కొన్ని రాశులపై ఈ సంచారము ద్వారా ప్రత్యేకంగా ప్రభావితమవుతాయి. వీరి జీవితాల్లో అనేక సానుకూల మార్పులు ఉంటాయి. జీవితంలో కొత్త దిశను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు కష్టపడి పనిచేస్తే విజయ నిచ్చెనను అధిరోహిస్తారు. కుజుడు శక్తి ద్వారా ప్రభావితమవుతారు. జీవితంలో ఉత్సాహాన్ని అనుభవిస్తారు. ఈ సంచారము కుటుంబ సంబంధాలలో కూడా మాధుర్యాన్ని తెస్తుంది. కనుక ఏ రాశులకు చెందిన వ్యక్తుల అదృష్టం మారుతుందో తెలుసుకుందాం.
మిథున రాశి
మిథున రాశి వారికి కుజ సంచార ప్రభావం ప్రయోజనకరంగా ఉంటుంది. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడికి మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ సంబంధాలలో కూడా మాధుర్యం ఉంటుంది. ఈ సమయం మిథున రాశి వారికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఆనందం ఉంటుంది.
తులా రాశి
ఈ కుజ సంచారము తుల రాశి వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు సంతోషంగా ఉంటాయి. తుల రాశి వారికి ఆనందం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీరి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మకరరాశి
మకర రాశి వారికి ఈ సంచారము ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సంచారములో ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. వ్యాపారం అయినా, ఉద్యోగం అయినా, రెండింటిలోనూ లాభం పొందే అవకాశం ఉంది. ఈ వ్యక్తులు ఆరోగ్యం , ఆర్థిక స్థితిలో కూడా ప్రయోజనాలను పొందుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు