Astrology Money
ప్రస్తుతం వృషభ రాశిలో గురువుతో కలిసి సంచారం చేస్తున్న కుజుడు ఆ రాశిలో బాగా బలపడడం జరుగుతోంది. స్థిర రాశిలో సంచారం చేసే కుజుడు సాధారణంగా స్వయంకృషికి అండగా నిలుస్తాడు. కుజుడు ఒక పోరాట గ్రహం. ఈ రాశిలో సంచారం చేసే కుజుడికి ఆదాయంలో గానీ, అధికారంలో గానీ, ఆస్తిపాస్తుల విషయంలో గానీ ఇతరుల సహాయం లభించే అవకాశం ఉండదు. ఆగస్టు 26 వరకూ వృషభ రాశిలో సంచారం చేస్తున్న కుజుడు ఎక్కువగా స్వయం కృషి మీద ఆధారపడే వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీన రాశులకు అదనపు ఆదాయ మార్గాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఊహించని ఉద్యోగావకాశాలు కల్పిస్తాడు.
- వృషభం: ప్రస్తుతం ఈ రాశిలో గురువుతో కలిసి సంచారం చేస్తున్న కుజుడు ఈ రాశివారికి ఆదాయాన్ని తప్పకుండా వృద్ధి చేస్తాడు. అనేక ఆదాయ మార్గాలను ఈ రాశివారికి అందుబాటులోకి తీసుకు వస్తాడు. ఎంత కష్టానికైనా ఓర్చుకునేటట్టు చేస్తాడు. ఉద్యోగంలో ఇతరులతో పోటీపడి, ప్రాధాన్యం, ప్రాభవం సంపాదించుకుంటారు. ఈ రాశివారి నుంచి గతంలో సహాయం పొందిన బంధుమిత్రు లంతా ముఖం చాటేసే అవకాశం ఉంటుంది. ఒంటరి పోరాటంతో ఆశించిన విజయాలు సాధిస్తారు.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న ఉద్యోగ స్థానాధిపతి కుజుడు తప్పకుండా వృత్తి, ఉద్యో గాల్లో పురోగతిని ఇచ్చే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వయం ప్రతిభతో గుర్తింపు తెచ్చు కుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఎంత పోటీ ఉన్నా అంతిమ విజయం వీరిదే అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు పోటీ పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో తమ ప్రతిభను నిరూపించుకుని అందలాలు ఎక్కుతారు. ఆదాయాన్ని పెంచుకుంటారు.
- సింహం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో ఈ రాశివారి ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో వీరు తమ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. తమ ప్రతిభా పాటవాలను, నైపుణ్యాలను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి, లాభాల బాటపట్టిస్తారు. పద్ధతి ప్రకారం ఆదాయాన్ని వినియోగించుకుని, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం, మదుపు చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.
- వృశ్చికం: ఈ రాశినాథుడైన కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల, ఏ పని సాధించాలన్నా, ఏ ప్రయత్నం నెరవేరాలన్నా శారీరక కష్టం, మానసిక ఒత్తిడి ఉంటాయి. వాటిని తట్టుకుని వృత్తి, ఉద్యోగాల్లో అందలం ఎక్కడం, ఆదాయాన్ని పెంచుకోవడం జరుగుతుంది. వ్యాపారాల్లో భాగస్వా ములతో ఎటువంటి సమస్యలున్నా రాజీ మార్గంలో పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామిని కూడా సొంతగా ఎంచుకోవడం జరుగుతుంది. సాధారణంగా ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి ఆరవ స్థానంలో రాశ్యధిపతి గురువుతో కుజుడు సంచారం చేస్తున్నందువల్ల ప్రతి పనినీ మొండి పట్టుదలతో సాధించుకోవడం జరుగుతుంది. ఎవరి సహాయ సహాకారాలు లేకుండానే, సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో ప్రతి వ్యవహారాన్నీ చక్కబెట్టడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి, వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పదోన్నతిని సంపాదించుకో వడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు తప్పకుండానష్టాల నుంచి బయటపడి లాభాల బాటపడతాయి.
- మీనం: ఈ రాశికి మూడవ స్థానంలో రాశ్యధిపతి గురువుతో కలిసి సంచారం కుజుడి వల్ల సాధారణంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. వీరి ప్రయత్నాల వల్ల అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆదాయం అనేక విధాలుగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలతో పాటు, కొన్ని వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో సాన్నిహిత్యాన్ని పెంచు కుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.