Today Rasi Phalalu: ప్రతిరోజూ మనం ముందువెనుక ఆలోచించకుండా ఏమరపాటుతో తీసుకునే నిర్ణయాలతో జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పెద్దలు సూచిస్తుంటారు. అందుకే తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే తెలుసుకునేందుకు రాశి ఫలాలను అనుసరిస్తారు. అయితే.. గురువారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం..
మేషరాశి: ఈ రాశి వారు నేడు చేపట్టే పనుల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపిస్తుంది. కొంచెం కష్టపడితే.. పనుల్లో సత్ఫలితాలు కనిపిస్తాయి. పనితీరు, ప్రతిభకు అందరినుంచి ప్రశంసలు లభిస్తాయి.
వృషభ రాశి: ఈ రాశి వారు ఆచితూచి ముందడుగు వేయాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరిస్తే.. సమస్యలను అధిగమించవచ్చు. సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యంతో ముందడుగు వేయాలి.
మిథున రాశి: ఈ రాశి వారు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. సమయానుకూలంగా వ్యవహరించాలి. పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
కర్కాటక రాశి: ఈ రోజు కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి సత్ఫలితాలను అందుకుంటారు. పెద్దల నుంచి, కుటుంబసభ్యుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
సింహ రాశి: ఈ రాశి వారికి తడబాట్లు ఎదురైనప్పటికీ.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం వరిస్తుంది. పలు కార్యాలల్లో విజయం చేకూరుతుంది. ఆవేశంగా వ్యవహరించకపోవడం మంచిది.
కన్య రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పలు పనులను జాగ్రత్తగా చేపట్టాలి. బంధువుల సహకారం లభిస్తుంది.
తులా రాశి: కీలక సమస్యలను అధిగమిస్తారు. అధికారులు, కుటుంబసభ్యుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
వృశ్చిక రాశి: ఈ రాశివారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధైర్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే.. సత్ఫలితాలను అందుకుంటారు.
ధనుస్సు రాశి: ఈ రాశివారు చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల సహకారంతో ఆటంకాలను అధిగమించి.. పనుల్లో ముందడుగు వేస్తారు.
మకర రాశి: ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆకస్మిక ధన వ్యయం కలిగే సూచనలున్నాయి. కొన్ని పనుల్లో ఆటంకం ఏర్పడి ఇబ్బందులు ఎదురవుతాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి.
కుంభ రాశి: ఈ రాశివారు గొడవలకు దూరంగా ఉండటం మేలు. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. ధైర్యంతో ముందడుగువేయాలి.
మీన రాశి: ఈ రాశివారు చేపట్టే పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రయాణం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.
Also Read: