
దిన ఫలాలు (సెప్టెంబర్ 1, 2025): మేష రాశి వారికి అనుకోకుండా మంచి ధన యోగం పట్టే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోయే అవకాశముంది మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. అనుకోకుండా వారికి మంచి ధన యోగం పడుతుంది. ఆస్తి వివాదం తోబుట్టువుల అనుకూలతతో పరిష్కారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. సమాజంలో ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింతగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువులను తలదూర్చ నివ్వవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. బంధు మిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు అంది వస్తాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల మీద ఆధారపడడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆదాయ మార్గాలతో పాటు శ్రమ కూడా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. కొద్దిపాటి వ్యయప్రయాసలున్నా ఆస్తి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పనులను పూర్తి చేస్తారు. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. శతభిషం, వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు సానుకూలంగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి ఏర్పడుతుంది.
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉండడం వల్ల అటు వృత్తి, ఉద్యోగాలపరంగానూ, ఇటు ఆర్థికం గానూ స్థిరపడే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, కుటుంబపరంగా కూడా శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. నిరుద్యోగులకు ఊహించని కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. కొత్త ఆలోచన లకు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. లాభాలపరంగా వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా సాగిపోతాయి.
ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. కొందరు మిత్రుల కారణంగా కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సొంత విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు చాలావరకు లాభాల బాటలో సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది.
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ప్రతిష్ఠాత్మక కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.
ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఆదాయపరంగా మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుతారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాద్యతలు పెరిగే సూచనలున్నాయి. అధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పరవాలేనిపిస్తుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.