అక్టోబర్ 7 దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్ న్యూస్..! మీ రాశికి ఇలా..

Horoscope Today (October 07, 2026): బుధవారం 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడంతో పాటు వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. వృషభ రాశి వారు చేపట్టే ప్రయత్నాలు అనుకూలంగా సాగి ముఖ్యమైన పనులు సులభంగా పూర్తవుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. మరి మేషం నుంచి మీనం వరకు మిగిలిన రాశుల వారికి ఈ రోజు గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో చూద్దాం.

అక్టోబర్ 7 దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్ న్యూస్..! మీ రాశికి ఇలా..
Horoscope Today 07 Oct 2026

Edited By:

Updated on: Oct 07, 2026 | 6:00 AM

దిన ఫలాలు (అక్టోబర్ 07, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. వృషభ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా అనుకూలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. గృహ, వాహన సౌక ర్యాల మీద దృష్టి పెడతారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి కూడా వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. శుభ గ్రహాల అనుకూలత వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా అనుకూలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సొంత ఆలోచనల వల్ల లాభం ఉంటుంది. కొందరు మిత్రుల వల్ల ఇబ్బందులుంటాయి.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగు పడు తుంది. ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణ యాలు తీసుకుంటారు. పిల్లలు బాగా పురోగతి సాధిస్తారు. లాభదాయక పరిచయాలు కలుగు తాయి. సన్నిహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోవడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులు బాగా ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి జీవితం కొత్తపుంతలు తొక్కుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ధనాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొందరు బంధువుల్ని ఆర్థికంగా ఆదుకుంటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయ త్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగాఅనుకూలంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగ బాధ్యతల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. అద నపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గే అవకాశముంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. విదేశాల నుంచి ఆశిం చిన కబురు అందుతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలున్నాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యాలకు, ఉచిత సహాయాలకు ఇది సమయం కాదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. బంధువుల రాకపోక లుంటాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో నిర్దేశిత లక్ష్యాలు, బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, ఆలయాల్ని సందర్శిస్తారు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సాయం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారానికి సంబంధించి శుభవార్త అందుకుంటారు. ఇష్టమైన మిత్రులతో విందులో పాల్గొంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు నిదానంగా కొనసాగుతాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపా రాల్లో కొత్త మార్గాలు అనుసరిస్తారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. రాజీమార్గంలో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించడంలో ఇబ్బందులు పడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సరైన స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు, లక్ష్యాలు పెరిగినప్పటికీ, మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యకలాపాలన్నీ సజావుగా సాగిపోతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ చూపించడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలకు తగిన సాను కూల స్పందన లభిస్తుంది. చాలా కాలంగా ఒత్తిడికి గురి చేస్తున్న ఓ వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. తలపెట్టిన పనులలో తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ జీవితం బాగా హ్యాపీగా సాగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఆధ్యాత్మిక సేవలు, కార్యకలాపాల మీద బాగా ఖర్చు పెడతారు. ప్రము ఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశాంత, ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. కుటుంబ పరిస్థితులు చక్క బడతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

Disclaimer: జ్యోతిష్య శాస్త్రం, రాశిఫలాలు విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడుతున్న సమాచారం మాత్రమే. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైనవిగా పరిగణించరాదు. వ్యక్తిగత నిర్ణయాలకు రాశిఫలాలను ఏకైక ఆధారంగా తీసుకోకండి.

Loading...
Unable to load recommendations.
Follow Us