Rashi Phalalu: పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today (November 28, 2025): మేష రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలిస్తాయి. రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది. వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలకు సంబంధించినంత వరకూ బడ్జెట్ తారుమారవుతుంది. మిథున రాశి వారికి కొద్దిగా ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Rashi Phalalu: పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Rashi Phalalu 28 November 2025

Edited By:

Updated on: Nov 28, 2025 | 5:31 AM

దిన ఫలాలు (నవంబర్ 28, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రోజంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఇష్టమైన పనులన్నిటినీ కష్టమైనా పూర్తి చేస్తారు. ఇష్టమైన వ్యక్తుల్ని, ప్రేమ భాగస్వామిని కలుసుకుంటారు. సీనియర్ల సహాయ సహకారాలతో ఉద్యోగంలో విధులను సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో విందులో పాల్గొంటారు. భాగ స్వాములను సంప్రదించి వృత్తి, ఉద్యోగాలను విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలిస్తాయి. రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆదాయ వ్యయాలకు సంబంధించినంత వరకూ బడ్జెట్ తారుమారవుతుంది. కుటుంబ సభ్యుల మీద అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. బాగా ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. అద నపు ఆదాయాన్ని షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. వైవాహిక జీవితంలోనూ, ప్రేమ జీవితంలోనూ ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): కొద్దిగా ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో లక్ష్యాలను, బాధ్యతలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ప్రేమ జీవితం, దాంపత్య జీవితం హ్యాపీగా గడిచిపోతాయి. ఇంటి బాధ్యతల మీద మరింతగా శ్రద్ద పెడతారు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. రోజంతా బాగా బిజీగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): రోజంతా సవాళ్లు, సమస్యలతో సాగిపోయే అవకాశం ఉంది. కొద్దిగా ఆత్మ విశ్వాసం తగ్గుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో దూకుడు పెంచడం మంచిది. కొన్ని కలలు సాకారమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఎంత ఒత్తిడి ఉన్నా వృత్తి, ఉద్యోగాల్లో పరిస్థితులు అనుకూలంగా సాగిపోతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అసంతృప్తి కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉండకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన పత్రాల మీద సంతకాలు చేయకపోవడం శ్రేయస్కరం. వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థత బాగా వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు పురోగతి చెందుతాయి. ఆదాయ వృద్ధిలో ప్రతిష్ఠంభన ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి రోజంతా సరిపోతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందడంతో పాటు రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో విధులు, బాధ్యతలకు కట్టుబడి ఉండడం ఉత్తమం. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులను మీ అసాధారణ ప్రతిభా పాటవాలతో ఆకట్టుకుంటారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడం మీద దృష్టి పెడతారు. ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఆచరణాత్మక మార్పులు చేపట్టి లబ్ది పొందు తారు. కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తారు. ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. స్థిరాస్తి సంబంధమైన లాభాలు చేతికి అందుతాయి. ఆరోగ్యం సాఫీగా, సజావుగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, ఉద్యోగాల్లోని పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకపోవడం మంచిది. ఉద్యోగంలో విధి నిర్వహణ మీద శ్రద్ద పెంచడం శ్రేయస్కరం. కుటుంబ సభ్యులతో ఒక విందులో పాల్గొనే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉండకపోవచ్చు. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఎంతో దూరదృష్టితో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు చేపడతారు. అటు ఉద్యోగంలోనూ, ఇటు వృత్తి, వ్యాపారాల్లోనూ ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేపడతారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్ట డం మంచిది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో విహార యాత్ర చేపడ తారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు ఆశించిన సమాచారాన్ని అందుకుంటారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెంచుతారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): అనవసర ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు యథాతథంగా కొనసాగుతాయి. ఆదాయ వ్యయాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో భారీ లక్ష్యాలను పూర్తి చేయవలసి వస్తుంది. బాగా ఒత్తిడికి గురవుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో కూడా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి అనుకోకుండా శుభ వార్తలు అందుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సాహాలతో పాటు శ్రమ, ఒత్తిడి కూడా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. అదనపు ఆర్థిక ప్రయత్నాల మీద మరింతగా శ్రద్ధ పెంచడం ఉత్తమం. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ జీవితం మీద ఆర్థిక ఒత్తిడి ప్రభావం ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.