Horoscope Today: ఈ రాశులవారికి కొత్తవారితో స్నేహం ఏర్పడుతుంది.. ఖర్చులు పెరుగుతాయి.. మంగళవారం రాశి ఫలాలు..

|

May 10, 2022 | 7:22 AM

వీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీరు తలపెట్టిన కార్యాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Horoscope Today: ఈ రాశులవారికి కొత్తవారితో స్నేహం ఏర్పడుతుంది.. ఖర్చులు పెరుగుతాయి.. మంగళవారం రాశి ఫలాలు..
Horoscope Today
Follow us on

మేష రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబంలో విభేదాలు తగ్గుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కొత్త కార్యాలను ప్రారంభిస్తారు. కొత్తవారితో పరచయం ఏర్పడుతుంది.

వృషభ రాశి..
వీరు చేపట్టిన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు వీరు కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు. కుటుంబంలోని పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మిథున రాశి..
ఈరోజు వీరు అత్యధిక మానసికాందోళనతో ఉంటారు. వీరు మొదలు పెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడుతుంది. కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కర్కాటక రాశి..
ఈరజు వీరికి చేపట్టిన అన్ని పనులలో విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులతో విభేధాలు తగ్గుతాయి. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ది ఉంటుంది.. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

సింహ రాశి..
ఈరోజు వీరు తలపెట్టిన నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకూడదు.. ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం వలన మానసిక ఆందోళన తగ్గుతుంది.

కన్య రాశి..
వీరికి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో తలెత్తిన విభేధాలు తగ్గుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.

తుల రాశి..
ఈరోజు వీరు తలపెట్టిన పనులను ఆలస్యంగా పూర్తి చేస్తార. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. అబద్దాలకు దూరంగా ఉండాలి. అనవసర భయాందోళనకు గురవుతారు. కొత్త వారితో పరిచయం పెరుగుతుంది.

వృశ్చిక రాశి..
వీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీరు తలపెట్టిన కార్యాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గోంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. కొత్తవారిని కలుసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనుస్సు రాశి..
ఈరోజు వీరు చేపట్టిన ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబం లో విబేధాలు తగ్గుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తగ్గుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

మకర రాశి..
ఈరోజు వీరు చేపట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేస్తారు. చెడు పనులకు దూరంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభ రాశి..
ఈరోజు వీరు శుభకార్యాలలో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

మీన రాశి..
ఈరోజు వీరు తలపెట్టిన కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట

Rakul Preet Singh: అది సిగ్గుపడాల్సిన విషయం కాదు.. రకుల్ సంచలన కామెంట్స్

KGF Chapter2: ఖండాంతరాలు దాటుతోన్న కేజీఎఫ్‌ ఖ్యాతి.. ఆ దేశంలో ప్రదర్శించిన తొలి కన్నడ చిత్రంగా అరుదైన రికార్డు..

Thalapathy 66 : దళపతి సినిమాలో సహజ నటి.. విజయ్ 66లో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్