
దిన ఫలాలు (మే 9, 2026): మేష రాశికి చెందిన ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల ఆదరణ ఉంటుంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు డిమాండ్ పెరిగి కొత్త అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. మిథున రాశి వారికి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల ఆదరణ ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేయడం జరుగుతుంది.
ఉద్యోగులకు డిమాండ్ పెరిగి కొత్త అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా కొనసాగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది.
ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. శ్రమ, తిప్పట ఎక్కువగానే ఉన్నప్పటికీ అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. కొందరు మిత్రుల వల్ల బాగా ఇబ్బంది పడతారు.
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కూడా ఉంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధుమిత్రులతో సామరస్యం నెలకొంటుంది. కుటుంబంలో అన్యోన్య వాతావరణం నెలకొంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.
ఆర్థిక, ఆస్తి వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు లభిస్తాయి. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పరిచయాల వల్ల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. బంధువులు, మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఒక శుభ కార్యంలో ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.
ఉద్యోగాల్లో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.
ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మరింతగా పురోగతి సాధిస్తారు. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. స్నేహితుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో కొందరు బంధువులు సహాయపడతారు.
ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబ విషయాల్లో బంధుమిత్రులు జోక్యం చేసుకోకుండా చూడాలి. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వృథా ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇష్టమైన బంధువులతో కాలక్షేపం చేస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరులకు ఆర్థికంగా సహాయపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. శుభకార్యం తలపెడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. విదేశాల నుంచి శుభ వార్తలు వినే అవకాశం ఉంది.
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆదాయం పెర గడానికి అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు వసూలవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అవుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది.
ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. స్తోమతకు మించి మిత్రులకు సహాయపడతారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)