
దిన ఫలాలు (మార్చి 23, 2026): మేష రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బరువు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ విజయవం తంగా పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఒకటి రెండు ఆలయాలు సందర్శిస్తారు. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. విహార యాత్రకు వెళ్లే అవకాశముంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.
ఉద్యోగంలో బరువు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశముంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల్ని చక్కబెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది.
ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ప్రతి పని లోనూ వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థి కంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కొందరు మిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. వ్యాపార జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానేఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వ్యాపారాలు నష్టాల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఉపయోగం ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్య నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థిక విషయాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బరువు బాధ్యతలు కాస్తంత ఎక్కువగానే ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో బాగా లాభాలు గడిస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి జీవితాలవారు ఆశించిన ఆదాయం పొందుతారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొద్దిగా ఆలస్యం గానే అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ చాలావరకు పూర్తవుతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లో ఆశించిన ఉద్యోగం సంపాదించుకుంటారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
ఆదాయం పెరిగి ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. బాగా ఊరట చెందుతారు. వ్యాపారంలో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. మనసులోని కోరిక ఒకటి అనుకో కుండా నెరవేరుతుంది. ఒకటి రెండు ఆశించిన శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో కూడా క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆదాయ వృద్ధి మీద దృష్టి పెడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని కూడా సంప్రదించడం మంచిది. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
ఉద్యోగులు అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. శ్రమ, తిప్పటలతో కానీ ముఖ్య మైన వ్యవహారాలు పూర్తికావు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతానికి ప్రయాణాల్ని వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఇబ్బందులు లేకుండా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. గృహ, వాహనాల కొనుగోలుపై దృష్టి పెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అనుకూలమైన సమయం ఇది. పిల్లలు పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.