
దిన ఫలాలు (మార్చి 18, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభించడంతో పాటు వారి హోదా పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు, కార్యకలాపాలు బాగా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మిథున రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగిపోయే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. మిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
ఉద్యోగంలో బాధ్యతలు, కార్యకలాపాలు బాగా ఎక్కువగా ఉంటాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో సరికొత్త గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వాహన యోగం కలుగుతుంది. ఉద్యోగ పరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.
ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలకు అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఒకటి రెండు అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత, వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యల్ని పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల విషయంలో సానుకూల సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగంవారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొన్ని కీలక అవకాశాలు లభిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యయ ప్రయాసలతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. కుటుంబంలో మాట పట్టింపులు తలెత్తే అవకాశముంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ధనపరంగా ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది.
ఉద్యోగంలో అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారి రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులన్నీ కొద్దిపాటి వ్యయప్రయాసలతో సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే అవకాశం కూడా ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామికి ఆకస్మిక ధన లాభం ఉంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు కలుగుతాయి. ఇంటి వ్యవహారాలను చక్కబెడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు బాగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆర్థికంగా రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు తగ్గట్టుగా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి, పని భారం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. వ్యాపారాలను విస్తరించే ఆలోచన చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. పెండింగ్ పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో బిజీ అవుతారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. బంధువుల రాకపోకలుంటాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.