
దిన ఫలాలు (జూన్ 7, 2026): మేష రాశి వారికి ఈ రోజు రావాల్సిన డబ్బు కూడా అందుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తుంది. వృషభ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. మిథున రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. రుణాలు వసూలవుతాయి. రావాల్సిన డబ్బు కూడా అందుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలించి, ఆశించిన సంబంధం ఖాయమవుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరగడం, మంచి గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు బాగా పురోగతి సాధిస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాల్లో కొద్దిగా మార్పులు చేసి లబ్ధి పొందుతారు. గట్టి పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా సాగుతాయిజ. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవసరం. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పెద్దల జోక్యంతో చాలావరకు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆహార, విహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటారు.
ఉద్యోగంలో అధికారులతో వ్యవహారాలన్నీ సామరస్యంగా సాగిపోతాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఎవరితోనూ వాదోపవాదాలు పెట్టుకోవద్దు. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. కొత్త ప్రయత్నాలకు ఇది చాలావరకు అనుకూలమైన సమయం.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు, సహోద్యోగులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కొందరు చిన్ననాటి మిత్రుల్ని, బంధువుల్ని కలుసుకుంటారు. విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యంలో పాల్గొంటారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.
అవసరానికి తగ్గట్టుగా డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి లభిస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయ వంతమవుతాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో బాధ్యతలు, విధులను సమర్థవంతంగా నిర్వర్తించి మంచి గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పురోగమిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశముంది.
ఆర్థికాభివృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. వ్యక్తి గత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి. తల్లితండ్రుల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. మిత్రుల వల్ల కొన్ని కీలక పనులు సానుకూలపడతాయి. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది.
ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలే కాకుండా వ్యాపారాలు కూడా ప్రోత్సాహకరంగా పురోగమిస్తాయి. కీలక విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ఆశించిన స్థాయిలో లాభపడతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ప్రయత్నాలకు అవరోధాలు తొలగుతాయి. బంధువుల నుంచి ఆదరపూర్వక ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం బాగా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది కానీ, వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధుమిత్రులకు సహాయం చేసే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి, ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది కానీ, కొందరు సహచరుల విమర్శలు చేసే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు వింటారు.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువవుతాయి. కొందరు ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. మీ సలహాలు, సూచనలకు మంచి విలువ ఏర్పడుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు అందుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల సమాచారం ఒకటి సంతృప్తిని కలిగిస్తుంది.
గ్రహ బలం కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా ప్రశాంతంగా, అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యానికి, ప్రాభవానికి లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. పిల్లల చదువుల మీద బాగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.