
దిన ఫలాలు (జనవరి 12, 2026): మేష రాశి వారి ఆదాయ వృద్ది ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఆదాయ వృద్ది ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, లక్ష్యాలు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు మంచి ఫలితాలనిస్తాయి. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. పుణ్య క్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి.
భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడి సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకోకుండా మంచి అదృష్ట యోగం పడుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయపడే స్థితికి చేరుకుంటారు.
రాశ్యధిపతి బుధుడు సప్తమంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు కలిసివస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. బంధువులు పక్కదోవ పట్టించడం జరుగుతుంది.
ప్రధాన గ్రహాలు షష్ట స్థానంలో యుతి చెందడం వల్ల పనులు, ప్రయత్నాలు వ్యయప్రయాసలతో గానీ పూర్తి కావు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొందరు బంధుమిత్రులతో అకారణ విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి కానీ, ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ధనాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో తగిన స్పందన లభిస్తుంది.
రాశ్యధిపతి రవి పంచమ స్థానంలో బుధ, కుజులతో కలిసి ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఏలిన్నాటి శని కారణంగా ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. గురువు అనుగ్రహం వల్ల ఆదాయానికి లోటుండదు. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది.
చతుర్థ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు పురోగతి కూడా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా అనుకూలంగా ఉంటుంది. ఉచిత సహాయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలున్నాయి.
శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గా లలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూలించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పెండింగ్ పనులన్నీ తక్కువ శ్రమతో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
రాశ్యధిపతి కుజుడు ధన స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను చాలావరకు పరిష్కరిస్తారు. ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల రోజంతా శుభవార్తలతో, సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లలు బాగా పురోగతి చెందుతారు.
రాశ్యధిపతి గురువుతో పాటు, బుధ, రవులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
ఈ రాశిలో శుక్రుడు ప్రవేశించడం, రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహించడం జరుగుతుంది. మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో భారీ లాభాలకు అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. బంధుమిత్రులు మీ నుంచి సహాయాన్ని ఆశించడం జరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
పంచమాధిపతి బుధుడితో లాభాధిపతి గురువుకు పరివర్తన జరగడం వల్ల ఆదాయం పెరగడానికి ఎటువంటి ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితాలనిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఎక్కువగా శుభ ఫలితాలే చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు జరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
రాశ్యధిపతి గురువు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు.