
దిన ఫలాలు (జనవరి 2, 2026): మేష రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలుండే అవకాశముంది. వృషభ రాశి వారి ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉండే అవకాశముంది. మిథున రాశి వారు ఉద్యోగంలో భారీ లక్ష్యాలను పూర్తి చేయవలసివస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగంలో మీ కృషికి, మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర రంగాలవారికి రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
అన్ని రంగాలకు చెందినవారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచవలసిన అవసరం ఉంది. ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లలు చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
ఉద్యోగంలో భారీ లక్ష్యాలను పూర్తి చేయ వలసివస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. రావలసిన డబ్బు డబ్బు చేతికి అందుతుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇష్టమైన బంధువులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.
ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది కానీ కుటుంబ ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన వ్యవహారాలను పూర్తి చేయడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలకు బాగా విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించి శుభ సూచనలు కనిపిస్తాయి. వ్యవహార జయానికి, కార్యసిద్ధికి అవకాశం ఉంది. ముఖ్య మైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే ఆలోచన చేస్తారు. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటు అవుతుంది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు చక్కబడతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.
వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగుతాయి. అధికారుల నుంచి ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఇతరుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి, కొత్త ఆఫర్లు అందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలిస్తాయి.
ఆదాయం, ఆరోగ్య పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. సొంత పనులు పూర్తి చేసుకుంటారు. మీకు రావలసిన డబ్బు అందుతుంది. ఆర్థిక సర్దుబాట్లు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి ఆఫర్లు అందివస్తాయి.
ఉద్యోగంలో ఊహించని ప్రోత్సాహకాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి అనుకో కుండా పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని పూర్తి చేస్తారు. కొన్ని ప్రయత్నాలు వ్యయ ప్రయాసలతో నెరవేరుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.
వృత్తి, ఉద్యోగాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు కుటుంబ సభ్యుల నుంచి సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు నిదానంగా సర్దుకుంటాయి. చేపట్టిన ముఖ్యమైనపనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి.
ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. మొత్తం మీద వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనిచేసి శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. ఏ రంగానికి చెందినవారికైనా సమయం అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. బంధువుల్ని కలుసుకుంటారు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.