
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. డాక్టర్లకు, లాయర్లకు, ఇతర వృత్తు లవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. సోదర వర్గంతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగి పోతాయి. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. కొన్ని ముఖ్యమైన వ్యవ హారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. సమాజంలో మాట చెల్లుబాటు అవుతుంది. కొత్త ప్రయత్నాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. విశ్రాంతి లేక ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాల్లో తప్పకుండా విజయం లభిస్తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో తొందరపాటుతో మాట్లాడి, ఆ తర్వాత ఇబ్బందిపడే సూచనలు కనిపిస్తున్నాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవు తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో అప్రయత్నంగా కూడా లాభాలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరిగి రుణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశం ఉంది. మనసులోకి కోరికలు నెరవేరుతాయి. సంపాదన పెరుగుతుంది కానీ కుటుంబ సభ్యుల మీద కూడా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపి స్తుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త ప్రాజెక్టులు, కార్యక్రమాలు చేప డతారు. ధనపరంగా ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొందరు మిత్రులు లేదా దగ్గర బంధువులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. సోదరులకు అండగా నిలబడతారు. కొందరు మిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపార లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. అనుకున్నవి అనుకున్నట్టు జరిగే అవకాశం ఉంది. పోటీదార్లతో సమస్యలు తలెత్తవచ్చు. ఆధ్యా త్మిక చింతన బాగా పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అనారోగ్యం నుంచి కోలుకుం టారు. నిరుద్యోగులకు కొన్ని విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో సమర్థతను నిరూపించుకుంటారు. వృత్తి జీవితంలో బాగా రాణిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలని స్తాయి. కుటుంబ వ్యవహారాలు ప్రశాంతంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగు తుంది. చదువుల్లో పిల్లలకు సహాయం చేస్తారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరిగినప్పటికీ, ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిల కడగా ముందుకు సాగుతాయి. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఇంటా బయటా ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. బంధుమిత్రుల్లో మీ మాటకు, చేతకు విలువ ఉంటుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కొందరు మిత్రులతో అకారణంగా శత్రుత్వం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురు కావచ్చు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు కనిపి స్తాయి. ఆదాయం, రాబడి బాగానే ఉంటాయి. ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో కాస్తంత ఆచితూచి వ్యవ హరించడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సాగిస్తున్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రతిభా పాటవాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. షేర్లు బాగా లాభిస్తాయి.