
దిన ఫలాలు (డిసెంబర్ 7, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురువు మిథున రాశి ప్రవేశం కారణంగా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. తోబుట్టువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. సమాజంలో ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు సప్తమంలో, గురువు ధన స్థానంలో సంచారం కారణంగా సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. కుటుంబ విషయాల్లో బంధువులను తలదూర్చనివ్వవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవలసి ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ధన కారకుడైన గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగ్గా ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహా రాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఉన్నతస్థాయి వారితో పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): శుక్ర, రవి, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందు వల్ల ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా అనుకూలంగా మారుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో రాబడికి లోటుండదు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడడం జరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి చతుర్థ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా పెరిగే అవకాశం ఉంది. కొద్దిపాటి ఆటంకాలు, ఇబ్బందులున్నా ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిల కడగా సాగిపోతుంది. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి, వ్యాపా రాల్లో దూసుకుపోతారు. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): కుజ, శుక్రులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. పదోన్నతికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): బుధ, శుక్ర, గురువుల అనుకూలత కారణంగా ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించి జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ముఖ్య మైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశిలో రవి, శుక్రుల సంచారం కారణంగా ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు కొత్త బాధ్యతలను అప్పజెప్పే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగాసాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): బుధ, రాహు, గురు గ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఒకరిద్దరు బంధుమిత్రులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధన నష్టానికి అవకాశం ఉంది. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): లాభ స్థానంలో రవి, కుజ, శుక్రుల సంచారం అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు ఏమాత్రం లోటుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): మిథున రాశిలో గురువు ప్రవేశించడంతో ఈ రాశివారికి ఆర్థిక బలం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి అదృష్టం పడుతుంది. ప్రతిష్ఠాత్మక కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా బాగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): భాగ్యస్థానంలో మూడు గ్రహాలు కలవడం, దశమ స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల ఉద్యోగం జీవితం వైభవంగా సాగిపోతుంది. అధికారులు మీ పనితీరుతో బాగా సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగి,లాభాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తి కరంగా చక్కబెడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది.