మేష రాశి..
ఈరోజు వీరు చేపట్టే పనులను వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ప్రతి విషయంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవాలి.
వృషభ రాశి..
వీరికి రోజు ఎక్కువగా మానసిక ఆందోళన ఉంటుంది. ఉద్యోగంలో స్థాన చలనం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. శత్రుబాధలు పెరుగుతాయి. ఆలోచింది సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కొత్తవారితో పరిచయం ప్రమాదం.
మిథున రాశి..
ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లోని వారికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు. దైవ దర్శనం చేసుకుంటారు. అన్ని రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది.
కర్కాటక రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులకు ఆటంకాలు కలుగుతాయి. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధుమిత్రలతో విభేదాలు ఏర్పడతాయి.
సింహరాశి..
ఈరోజు వీరు నూతన వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ, మర్యాదలు తగ్గుతాయి. దైవ దర్శనానికి ప్రయత్ని్స్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్య రాశి..
ఈరోజు నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. దీంతో మానసిక ఆందోళన పెరుగుతుంది. కొత్తవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర భయాందోళనలకు లోనవుతారు.
తుల రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తారు. కొత్త వారితో స్నేహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరికి బంధుమిత్రుతో మనస్పర్థలు పెరుగుతాయి. అనుకోకుండా అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఆందోళన పెరుగుతుంది. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరికి కుటుంబ కలహాలు దూరమవుతాయి. చేపట్టిన పనులకు ఆటంకాలు జరుగుతాయి. వృథా ప్రయాణాలు పెరుగుతాయి.అందరితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు.
మకర రాశి..
ఈరోజు వీరికి ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు అవసరం. కీళ్లనొప్పుల సమస్యలు వేధిస్తాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది.
కుంభ రాశి..
ఈరోజు వీరికి స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అత్యంత సన్నిహితులను కలుసుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గోంటారు.
మీన రాశి..
ఈరోజు వీరు రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. మానసిక ఆందోళన ఉంటుంది. స్త్రీలు స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
Note: రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.
Also Read: Beast VS KGF Chapter 2 : తెలుగు రాష్ట్రాల్లో ఆ టార్గెట్ పై కన్నేసిన బడా మూవీస్..
Trivikram Srinivas: ఓ వైపు సూపర్ స్టార్.. మరో వైపు పవర్ స్టార్.. గురూజీ మాస్టర్ ప్లాన్
Ravi Teja: జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న మాస్ మాహారాజా.. హైవోల్టేజ్ యాక్షన్ మోడ్‌లో రవితేజ